నాకు ఆ పిట్టకథ తెలుసు: త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram srinivas | టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఓ పిట్టకథ అనే సినిమాతో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది.

Last Updated : Jan 27, 2020, 08:09 AM IST
నాకు ఆ పిట్టకథ తెలుసు: త్రివిక్రమ్ శ్రీనివాస్

నటుడు బ్రహ్మాజీ అంటే తెలియని వాళ్లు టాలీవుడ్‌లో ఎవరూ ఉండరు. బ్రహ్మాజీ తన కుమారుడు సంజయ్‌ని వెండితెరకు పరిచయం చేయనున్నారు. చందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘ఓ.. పిట్టకథ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ఈ పిట్టకథ తనకు తెలుసునని, చాలా నచ్చిందన్నారు దర్శకుడు త్రివిక్రమ్. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఆనంద ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read: ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’.. సుడిగాలి సుదీర్ బాటలో యాంకర్ ప్రదీప్

పల్లెటూరి నేపథ్యంగా వస్తోన్న ఈ సినిమాలో విశ్వంత్, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, సంజయ్‌రావు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ‘ఓ పిట్టకథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో నాకు చిన్న లింక్ ఉంది. ఆ కథ నాకు తెలియడమే ఆ లింక్. దర్శకుడు చందుకు ఆలోచన వచ్చిన రెండు, మూడు టైటిల్స్‌లో ఓ పిట్టకథ పేరు బాగా నచ్చింది. దాంతో ఆ పేరును ఖరారు చేయమని సలహా ఇచ్చాను. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో టైటిల్ సూచించడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశానని’ తెలిపారు.

 Image Courtesy: Twitter/BRAHMAJI

‘నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ‘పైసా వ‌సూల్‌’,  గోపీచంద్‌తో ‘శౌర్యం2, ‘లౌక్యం’,‘సౌఖ్యం’ లాంటి కమర్షియల్ సినిమాలు చేశాం. కొత్తవారిని ప్రోత్సహించాలని భావించి దర్శకుడు చందుకు అవకాశమిచ్చాం. చందు చెప్పిన కథకు కనెక్ట్ అయ్యానని’ నిర్మాత ఆనంద ప్రసాద్ వివరించారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News