Gopichand Reveals Prabhas Secret డార్లింగ్ ప్రభాస్ ఎక్కువగా బయటకు రాడు. సినిమా ప్రమోషన్స్‌లోనే అతి కష్టంగా వస్తుంటాడు. సోషల్ మీడియాలో కనిపించడం కూడా ప్రభాస్‌కు అంతగా ఇష్టం ఉండదు. అయితే మొదటి సారిగా ప్రభాస్ ఓ టాక్ షోకు వచ్చాడు. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ సందడి చేశాడు. ప్రభాస్‌తో పాటుగా అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా గెస్టుగా వచ్చాడు. ఈ ఇద్దరి సంభాషణలు, సీక్రెట్లను బాలయ్య భలే రాబట్టేశాడు.
ఇక ప్రభాస్ పెళ్లి గురించి పలు మార్లు అడిగేశాడు. పెళ్లి గురించి ప్రభాస్ ఏ విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు. చేసుకుంటాను అని అయితే కన్ఫామ్గా చెప్పాడు. అది ఎప్పుడు ఎవరిని అనే విషయాలు మాత్రం చెప్పలేదు. ఇంకా పెళ్లి రాత రాయలేదేమోనని ప్రభాస్ కామెడీ చేశాడు. అయితే అనుష్క శెట్టి, కృతి సనన్‌లో ఎవరు రాణి అంటూ బాలయ్య ఇరకున పెట్టే ప్రశ్న వేసినా ప్రభాస్ తప్పించుకున్నాడు.
- SmoKING 🚬 #Prabhas Anna 🤙 pic.twitter.com/D71AbWwRs5
— Yuv Raj Prabhas (@imYuvRajPrabhas) January 6, 2023
అలా ప్రభాస్ పెళ్లి మీద మాత్రం ఈ ఎపిసోడ్లో బాగానే చర్చలు జరిగాయి. ఇక గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాక ప్రభాస్ సీక్రెట్లన్నీ బయటకు వచ్చాయి. ప్రభాస్ చిరాకులో ఉంటే ఏం చేస్తాడంటూ బాలయ్య అడిగిన ప్రశ్నకు గోపీచంద్ అసలు విషయాన్ని చెప్పేశాడు. ప్రభాస్ చిరాకులో ఉంటే.. అందరినీ వెళ్లిపొమ్మాడంట.. ఆ తరువాత అలా సైడ్‌కు వెళ్లి దమ్ముకొట్టి వచ్చేస్తాడట. దీంతో ప్రభాస్ స్మోమింక్ హ్యాబిట్ గురించి సీక్రెట్ బయటకు వచ్చింది.
ఇక మరో సందర్భంలో బాలయ్యతో పార్టీ చేసుకుందామని అంటాడు. మీ మ్యాన్షన్ హౌస్‌తో మనం పార్టీ చేసుకుందాం.. మిమ్మల్ని కూడా ఆ ఫాం హౌస్‌కు తీసుకెళ్తాను అని ప్రభాస్ అంటాడు. తనకు చిన్నప్పటి నుంచి అడవులు అంటే ఇష్టమని, ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి అడవుల్లో సంచరిస్తానని అన్నాడు. అందుకే ఇక్కడ కూడా అడవిని దత్తత తీసుకున్నానని, క్రూరమృగాలను కూడా పెంచొచ్చా? అని ప్రభుత్వాన్ని అడిగానంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి