GV Prakash: విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అదే కారణమని పోస్ట్

GV Prakash Divorce: బ్యాచిలర్ సినిమా ద్వారా తమిళంలో మంచి సక్సెస్ సాధించిన నటుడు జీవి ప్రకాష్. అయితే జీవి ప్రకాష్ నటుడు కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ పరిచయమే. కాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన విడాకుల వార్త ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 14, 2024, 09:46 AM IST
GV Prakash: విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అదే కారణమని పోస్ట్

GV Prakash Divorce Tweet: ప్రముఖ సంగీత డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి తమిళ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సంవత్సరానికి నాలుగు.. ఐదు సినిమాలు చేస్తూ.. ఈ మధ్య కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే.. మూడు మ్యూజికల్ హిట్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.  కాగా ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ సైతం వార్తల్లో నిలుస్తోంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తాను విరాకులు తీసుకుంటున్నట్టు నిన్న రాత్రి చేసిన పోస్ట్ ప్రస్తుతం ఓ రేంజులో వైరల్ అవుతుంది..

సినీ ఇండస్ట్రీలో ఈమధ్య విడాకులు అనేది చాలా కామన్ గా అవుతున్నాయి.. ముఖ్యంగా సౌత్ ఇండియాలో గత రెండు మూడు సంవత్సరాలలో ఎంతో మంది సెలబ్రిటీ విరాకులు తీసుకొని అందరిని షాక్ కి గురిచేశారు.. .. మొన్న హీరో ధనుష్ విడాకులు తీసుకోగా, నిన్న ధనుష్ స్నేహితుడు జీవి ప్రకాష్ కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇక ఈ రూమర్స్ నిజం చేస్తూ జీవి ప్రకాష్ తన విడాకుల వార్తను సోషల్ మీడియాలో తెలియజేశారు. నిన్న రాత్రి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేస్తూ .. ఎంతో ఆలోచించాం. కానీ చివరికి విడిపోవాలని నేను, సైంధవి నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు తీసుకుంటున్నా.. మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, అలాగే మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తర్వాతే విడాకులకు సిద్ధమయ్యాం.. అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..

కాగా జీవి ప్రకాష్.. భార్య ప్రముఖ గాయని సైంధవి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 11 సంవత్సరాలు కావస్తోంది. ఈ క్రమంలో ఎన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరూ విడాకులు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

 

Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News