Hema: రేవ్ పార్టీ ఘటనలో హేమకు బిగ్ షాక్.. మరో నోటీసు జారీ చేసిన సీసీబీ పోలీసులు..

Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ట్విస్ట్ కొనసాగుతుంది. ఈరోజు తమ ముందు హజరు కావాలని పోలీసులు  హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నట్లు నటి హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం.

Written by - Inamdar Paresh | Last Updated : May 27, 2024, 12:50 PM IST
  • సీసీబీ పోలీసులకు లేఖ రాసిన హేమ..
  • తీవ్ర ఉత్కంఠగా మారిన రేవ్ పార్టీ కేసు..
 Hema: రేవ్ పార్టీ ఘటనలో హేమకు బిగ్ షాక్.. మరో నోటీసు జారీ చేసిన సీసీబీ పోలీసులు..

Bengaluru rave party updates: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మే 27 న తమ ముందు హజరు కావాలని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు.. నటి హేమ బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరీ ఆమె పోలీసుల ముందు హజరవుతారా.. అనే దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో నటి హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం. తనకు ఆరోగ్యం బాగాలేదని, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నట్లు సీసీఎస్ పోలీసులకు లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో అనే దానిపై కూడా సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో దర్యాప్తు స్పీడ్ ను పెంచాలని పోలీసులు చూస్తున్నారు.

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

కేసు విషయంలో ఆలస్యం చేస్తే.. పొలిటికల్ ప్రెషర్ లు లేదా మరేదైన ఇబ్బందులు కల్గకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్లు  తెలుస్తోంది. ఇక మరోవైపు నటి హేమ కోర్టుకు వెళ్తారని కూడా కొన్ని వార్తలు విన్పిస్తున్నాయి. కోర్టుకు వెళ్లి.. తను సోసైటీలో ఒక మంచి గుర్తింపు ఉన్న నటి అని, దీనికి తనకు ఎలాంటి సంబంధంలేదని, మధ్యంతర ఉత్తర్వులు ఏమైన తెచ్చుకుంటారని కూడా వాదనలు విన్పిస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే నటి హేమ.. ఈ ఘటన బైటికొచ్చినప్పటి నుంచి కంటి నిండా నిద్ర, కడుపునిండా అన్నం కూడా తమ ఫ్యామిలీ తినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా.. ఈఘటనలో పూర్తి స్థాయిలో న్యాయపోరాటానికి సైతం సిద్దమని నటి హేమ అన్నారు. తాను సింహం లాంటి దాన్నని.. ఒక అడుగు వేస్తే.. పదడుగులు ముందుకు దూకుతానంటూ కూడా సామెతలు చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది కోసం పోరాడానని, తనమీద ఆరోపణలు వస్తే ఊరుకుంటానా..అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. నేరం రుజువయ్యే వరకు కూడా ఒకరిపై లేని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. సోషల్ మీడియాలో, ఇతర మీడియా డిబెట్స్ లలో అసత్య ప్రచారం చేయోద్దని కూడా ఎక్స్‌ వేదికగా ట్విట్ చేశారు. 

మరోవైపు నటి హేమ.. తాను బెంగళూరు పార్టీలో లేనని తన ఫామ్ హౌస్ లో ఉన్నానని  చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. పోలీసులు ఆమెకు ట్విస్ట్ ఇచ్చేలా అక్కడ ఉంది నటి హేమ అంటు ఫోటో రిలీజ్ చేశారు. ఇక నటి హేమ.. అక్కడున్న అమ్మాయి పెట్టుకున్న నెయిల్ పాలిష్ రంగు, తన చేతి వేళ్లకున్న నెయిల్ పాలిష్ రంగు ఒకటి కాదని కూడా చెప్పింది. ఇక మరోవైపు.. ఆమె బిర్యానీ వండుతున్న వీడియోలు షేర్ చేయడం వంటి వాటి వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే.

Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులు.. 103 మందికి డ్రగ్ టెస్టులు చేయగా.. అందులో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్టు  వచ్చింది. ఈ నేపథ్యంలో వారందరికి కూడా బెంగళూరు పోలీసులు వేర్వేరు తేదీలను ఇచ్చి,  తమ ముందు హజరు కావాలని నోటీసులు జారీచేసింది.  ఇదిలా ఉండగా రేవ్ పార్టీ ఘటనలో ఈ రోజు హజరు కాలేనని నటి హేమ పోలీసులుకు లేఖ రాశారు. దీనికి కౌంటర్ గా బెంగళూరు పోలీసులు మరో నోటీసు జారీ చేసినట్లు సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News