Happy birthday to Trivikram Srinivas: మాటలతో మాయ.. తెలుగు ప్రేక్షకుల మనసులు ఫిదా…

Trivikram: షడ్రుచులు,నవరసాలు ఒకే సన్నివేశంలో తన మాటలతో అద్భుతంగా ఆవిష్కరించగలిగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఎంతో కష్టమైన సిచువేషన్ అయినా.. నవ్వు వచ్చే కామెడీ సీన్ అయినా.. పవర్ఫుల్ పంచ్ డైలాగ్ అయినా.. త్రివిక్రమ్ కలం నుంచి వెలువడితే ఆ మజా వేరుగా ఉంటుంది. ఈరోజు త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్ మీ కోసం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 10:19 AM IST
Happy birthday to Trivikram Srinivas: మాటలతో మాయ.. తెలుగు ప్రేక్షకుల మనసులు ఫిదా…

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇతని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. రాయాలంటే పెన్నులో ఇంకు సరిపోదు.. అలాంటి విలక్షణమైన డైరెక్టర్ అంతకంటే గొప్ప రైటర్. త్రివిక్రమ్ మూవీలో మాటల తూటాలు పేలుతాయి. రోజు మన చుట్టూ జరిగే సంభాషణలాగా ఎంతో కామ్ గా ఉంటాయి త్రివిక్రమ్ డైలాగ్స్. ఇంతలో ఎక్కడ నుంచి వస్తుందో ఒక పంచ్ డైలాగ్.. అసలు ఆ మూవీ సీన్ ఇంటెన్సిటీనే మార్చేస్తుంది. సూటిగా తన మాటలతో ఎటువంటి సుత్తి లేకుండా తాను చెప్పదలుచుకున్నది సుతిమెత్తగా అర్థమయ్యేలా చెప్తాడు కాబట్టి ప్రేక్షకులు మాటల మాంత్రికుడు అని బిరుదు ఇచ్చారు.

స్వయంవరం చిత్రంతో రైటర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి..నువ్వే కావాలి మూవీ తో డైరెక్టర్ గా తన ప్రతిభ చూపించాడు. సినిమాలో ఎంతో పెద్ద భావనైనా, గుండెను పిండే ఎమోషన్ అయినా.. త్రివిక్రమ్ ఒక్క డైలాగులో మనసుకు హత్తుకునే విధంగా కన్వే చేస్తాడు.
'నీకే తలనొప్పి తెప్పించాడు అంటే ఆడు అమృతాంజనం అమ్మ మొగుడు అయ్యుంటాడు'లాంటి ఫన్నీ డైలాగ్ అయినా.. 'క్లాస్ లో ఎవడైనా సమాధానం చెప్తాడు కాని ఎగ్జామ్ లో రాసేవాడే.. ' వంటి భారీ డైలాగ్ అయినా త్రివిక్రమ్ హ్యాండిల్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది.

మాటల మాంత్రికుడి కలం నుంచి జాలువారిన ప్రతి పదం ఒక అమృత బిందువు లాగా ఉంటుంది. ఒక్కసారి త్రివిక్రమ్ మనసుపెట్టి డైలాగ్ రాస్తే అది మరుజన్మకైనా గుర్తుండాల్సింది. ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్.. 1972 నవంబర్ 7వ తారీఖున పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. 

త్రివిక్రమ్ తన ఎమోషనల్ డైలాగ్స్ తో మన మనసుల్ని ఆకట్టుకోగలడు.. అలాగే ఒకే ఒక పంచ్ తో హాల్ మొత్తం నవ్వుల పువ్వులు పూయించగలడు. కేవలం తన పదునైన పంచ్ డైలాగ్స్ తో మూవీని హిట్ గా మలచగలిగే ఈ తరం డైరెక్టర్ త్రివిక్రమ్. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, స్వయంవరం లాంటి సినిమాలకు ఆయన దర్శకుడు కాకపోయినా ఆయన డైలాగ్స్ ప్రాణం పెట్టాయి. ఇక ఆయన దర్శకుడిగా తీసిన నువ్వే నువ్వే సినిమా గురించి చెప్పనక్కర్లేదు. చివరి సన్నివేశంలో ప్రకాష్ రాజ్ శ్రీయ తో మాట్లాడే మాటలు మనకి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. 'మనం ఒక మనిషిని ప్రేమించామంటే వాళ్ళు చేసిన ప్రతి దాన్ని ప్రేమించాలి లేదు అంటే ప్రేమించలేదని ఒప్పుకోవాలి'... అంటూ నువ్వే నువ్వే లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్…ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక క్షణం గుర్తొస్తుంది.

అలానే ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది ఇలాంటి సినిమా కూడా అందించారు త్రివిక్రమ్. ఆ చిత్రంలో కూడా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ అక్షరంతో అక్షరం చెప్పే గలుగుతారు మన ప్రేక్షకులు. అంతలా మాయ చేసింది ఆయన పెన్ను పదును.

ముఖ్యంగా మహేష్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ చేసిన అతడు సినిమా తర్వాత డైలాగ్స్ అంటే ఇలా ఉండాలి అన్న టాక్ వచ్చింది. కాగా మంచి విజయాలతో దూసుకుపోతున్న త్రివిక్రమ్ ఖలేజా, అజ్ఞాతవాసి డిసప్పాయింట్ చేశాయి. ఇక త్రివిక్రమ్ పని అయిపోయింది అనుకునే సమయానికి గోడకి కొట్టిన బంతిలా అలవైకుంఠపురం లో అంటూ అలరించడానికి వచ్చాడు. ఆ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే త్రివిక్రమ్ గురించి ఎంతైనా చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ చేస్తున్నారు ఈ డైరెక్టర్. రాబోయే రోజుల్లో కూడా తన కలం తో మనల్ని మాయ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ఇట్లు ఇవ్వాలి అని కోరుకుంటూ త్రివిక్రమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం..

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News