Bigg Boss 6 Elimination: షాకిచ్చిన బిగ్ బాస్... ఊహించని కంటెస్టెంట్ ఔట్!

Inaya Sultana Eliminated From Bigg Boss 6 Telugu 3rd Week: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయ్యేది ఎవరనేది లీక్ అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 24, 2022, 04:54 PM IST
Bigg Boss 6 Elimination: షాకిచ్చిన బిగ్ బాస్... ఊహించని కంటెస్టెంట్ ఔట్!

Inaya Sultana Eliminated From Bigg Boss 6 Telugu 3rd Week: ఇప్పటికే తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ ఆరవ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడవ సీజన్ నుంచి బిగ్ బాస్ తెలుగును హోస్ట్ చేస్తున్న హీరో నాగార్జున ఈ ఆరో సీజన్ ని కూడా హోస్ట్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్లు పార్టిసిపెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం సుమారు ఏడుగురు హౌస్ లో ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.

కానీ మొదటివారం అందరికీ షాక్ ఇస్తూ ఒక్కరిని కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఎలిమినేట్ చేయలేదు. కానీ రెండో వారంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు కంటెస్టెంట్లను, హౌస్ లోపల నుంచి ఎలిమినేట్ చేశారు. షానీ సాల్మన్ అలాగే అభినయశ్రీ ఇద్దరినీ డబుల్ ఎలిమినేషన్ చేసి శని, ఆదివారాలలో ఇంటికి పంపేశారు. ఇక సాధారణంగా శని, ఆదివారాలలో నాగార్జున స్పెషల్ ఎపిసోడ్ ప్రసారమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.

దీనికి సంబంధించిన షూటింగ్ మొత్తం శనివారం నాడే ప్లాన్ చేసుకుంటుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఇక తాజాగా శని ఆదివారాలకు సంబంధించిన షూటింగ్ ఈరోజు పూర్తయిందని, ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోయేది రామ్ గోపాల్ వర్మ దెబ్బతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఇనయా సుల్తానా అని తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ కూడా ఆమెకు ఓట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా కోరారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇనయా సుల్తానా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

ఎందుకంటే నేహా చౌదరితో ఆమె పెట్టుకున్న గొడవ కరెక్ట్ గా లేదని తెలుస్తోంది. అది కాక ఆమెకు హౌస్ లో కొనసాగేందుకు సరిపడా ఓట్లు లభించలేదని మిగతా వారితో పోలిస్తే ఆమెకు చాలా తక్కువ ఓట్లు లభించాయని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. వీరిలో బాలాదిత్య, నేహా, గీతు, రేవంత్ , శ్రీహన్, చలాకీ చంటి టాప్‌లో ఉన్నారు. ఇక సుదీప, ఆరోహి,ఇనయా సుల్తానా ముందు నుంచి డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే సుదీప, ఆరోహి కంటే ఇనయా సుల్తానా తక్కువ ఓట్ల తెచ్చుకోవడంతో ఆమెను దాదాపుగా హౌస్ నుంచి సాగనంపడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఇక శ్రీహన్ విషయంలో పిట్ట వ్యవహారంలో పెట్టుకున్న గొడవ కూడా ఆమె మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడేలా చేసింది అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఆమె హౌస్ నుంచి బయటకు రాక తప్పదని ప్రచారం రూపొందుతుంది. అయితే ఈ విషయంలో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది.
 Also Read: God Father in Malayalam: మలయాళ రీమేక్ సినిమాను మళ్లీ డబ్బింగ్ చేస్తున్నారా? బుర్ర ఉందా?

Also Read: Salaar Leaked Scene: సలార్ మేకర్స్ కు మరో టెన్షన్.. సెట్ నుంచి వీడియో లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News