'ఇంటిలిజెంట్'ను ఆకాశానికెత్తేసిన బాలయ్య బాబు

ఇంటిలిజెంట్ సినిమా టీజర్‌ చూసిన తర్వాత సినిమాను ఎప్పుడు చూడాలా అనే కోరిక కలుగుతోంది : బాలకృష్ణ

Last Updated : Jan 28, 2018, 10:07 AM IST
'ఇంటిలిజెంట్'ను ఆకాశానికెత్తేసిన బాలయ్య బాబు

వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఇంటిలిజెంట్‌' సినిమా టీజర్‌ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా శనివారం విడుదల సాయంత్రం విడుదలైంది. ఈ టీజర్ లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ వివి వినాయక్‌ డైరెక్షన్‌లో తాను హీరోగా తెరకెక్కిన 'చెన్నకేశవరెడ్డి' సినిమాను గుర్తుచేసుకున్నారు. సినిమా మేకింగ్ విషయంలో వినాయక్ ఇన్‌వాల్వ్‌మెంట్‌, కలుపుగోలుతనం, ఆర్టిస్టు నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడం లాంటివి వినాయక్‌లో నాకు బాగా నచ్చే అంశాలు అని అన్నారు. ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన 'ఇంటిలిజెంట్‌' సినిమా టీజర్‌ని నా చేతుల మీదుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా వుంది అని ఆనందం వ్యక్తంచేశారు బాలయ్య బాబు. 

 

ఇంటిలిజెంట్ సినిమా టీజర్‌ చాలా బాగుంది. మిస్టీరియస్‌గా అనిపించింది. టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలా అనే కోరిక కలుగుతోంది. టైటిల్‌ కూడా చాలా బాగుంది. మెగా అభిమానులకు, నా సొంత బ్యానర్‌ లాంటి సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ నిర్మించిన సినిమా కనుక నా అభిమానులకు కూడా బాగా నచ్చుతుందని  అన్నారు బాలయ్య బాబు.

ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుండగా అంతకన్నా ఓ ఐదు రోజుల ముందుగా ఫిబ్రవరి 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు మూవీ యూనిట్ స్పష్టంచేసింది.

Trending News