Kollywood: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న తమిళ స్టార్ హీరో కుమారుడు.. కథానాయికగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు..

Kollywood Updates: కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ నటుడు దళపతి విజయ్. ఈయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. త్వరలో ఈయన కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2023, 11:02 AM IST
Kollywood: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న తమిళ స్టార్ హీరో కుమారుడు.. కథానాయికగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు..

Kollywood Updates: హీరోల వారసులు సినిమాల్లోకి రావడం సర్వసాధారణం. ఇలా చాలా మంది వచ్చి సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ కోలీవుడ్ స్టార్ నటుడు కుమారుడు తెరంగ్రేటం చేయబోతున్నాడు. అతడే దళపతి విజయ్ కుమారుడు సంజయ్. తమిళ్ లో దళపతికి ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమాలకు అక్కడి వాసుల బ్రహ్మరథం పడతారు. కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన విజయ్ కి తెలుగులోనూ మార్కెట్ ఉంది. దళపతి సినిమాలు అవలీలగా 100 కోట్ల మార్కును అందుకుంటాయి. ప్రస్తుతం విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఓ పక్క సినిమాల్లో రాణిస్తూనే.. మరోపక్క రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేయాలనుకుంటున్నాడు దళపతి. 

మరోవైపు విజయ్ కొడుకు సంజయ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ నడుస్తోంది. ఇతడికి జోడిగా మరో స్టార్ హీరోయిన్ కుమార్తె నటించనుంది. ఆమె మరెవరో కాదు ఒకప్పుడు స్టార్ కథానాయికగా కొనసాగిన దేవయాని కూతురు ఇనియకుమార్. సంజయ్,  ఇనియకుమార్‌ జంటగా ఓసినిమా తెరకెక్కించాలని చూస్తున్నాం అని  దేవయాని భర్త రాజ్ కుమార్‌ తెలిపారు. మా కూతురు ఇనియకుమార్‌ కు సినిమాల్లో నటించాలని కోరిక. అందుకే విజయ్ కొడుకు సంజయ్ కు ఫెయిర్ గా ఆమెను లాంచ్ చేయాలని చూస్తున్నాం అని రాజ్ కుమార్ అన్నారు. 

Also Read: Baby OTT: ‘బేబీ’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ కన్ఫామ్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

గతంలో అజిత్, దేవయాని హీరోహీరోయిన్లుగా నటించిన నీ వరివాయ్ ఎన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు రాజ్ కుమార్. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈసినిమా షూటింగ్ సమయంలోనే దేవయాని, రాజ్ కుమార్ మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసింది. ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని రాజ్ కుమార్ అనుకుంటున్నారు. అందులో హీరోహీరోయిన్లుగా సంజయ్, ఇనియకుమారులను నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: Tamannaah Bhatia: బటన్స్ విప్పేసి మెంటలెక్కించిన తమన్నా.. అదిరిపోయే హాట్ పోజులు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

 

Trending News