Jalsa Re Release Prooves Pawan Kalyan is Nizam Ka Nawab: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం విడుదల చేశారు. ఒకప్పటి ప్రింట్లను కాకుండా వాటిని 4k వర్షన్ లో డిజిటలైజ్ చేసి మరీ విడుదల చేసి మళ్లీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకోగలిగారు.
ఈ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో ఘరానా మొగుడు కూడా విడుదల చేశారు కానీ ఆ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు జల్సా, తమ్ముడు లాంటి సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ తేదీ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో భారీ ఎత్తున టికెట్లు బుక్ చేయించే పనిలో పడ్డారు. ఒక్క హైదరాబాదులోనే ఈ జల్సా సినిమా 50 షోలు విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.
కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే 20 షోలకు పైగా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఒక రీ రిలీజ్ సినిమా అది కూడా హైదరాబాదు లాంటి ఏరియాలో 50 షోలు దక్కించుకోవడం మామూలు విషయం కాదని తెలుస్తోంది. మహేష్ బాబు పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది, దాంతో పోలిస్తే జల్సా సినిమా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ పవన్ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
జల్సా సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి నిజాం నవాబే అని వారు కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల అయితే ఎంత హడావిడి ఉందో ఈ జల్సా సినిమా రీ రిలీజ్ విషయంలో కూడా అంతే హడావుడి ఉందంటే నైజాం ప్రాంతంలో ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: 24 Crafts of Movies: సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ ఏమేమిటో తెలుసా?
Also Read: Vicky Kaushal Filmfare Award: ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న విక్కీ కౌశల్ కు కత్రినా ముద్దుల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి