Jio Vs Airtel: జియో రూ.999 రీచార్జ్, ఎయిర్‌టెల్ రూ.999 రీచార్జ్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..?

Jio Vs Airtel Rs999 Recharge Plans: ఎలాగైతే తమ కస్టమర్స్‌కి సేవలు అందించే విషయంలో పోటీపడుతున్నాయో.. ధరలను ఫిక్స్ చేసే విషయంలో కూడా జియో, ఎయిర్‌టెల్ ఇంచుమించు ఒకే రకంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే అటు జియోలో ఇటు ఎయిర్‌టెల్‌లో.. రెండింటిలోనూ రూ.999 రీచార్జ్ ప్లాన్ ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 05:15 AM IST
Jio Vs Airtel: జియో రూ.999 రీచార్జ్, ఎయిర్‌టెల్ రూ.999 రీచార్జ్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..?

Jio vs Airtel Rs999 Recharge Plans: మొబైల్ నెట్‌వర్క్ పరంగా చూసినా.. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ పరంగా చూసినా.. ప్రస్తుతం ఇండియాలో టాప్ మోస్ట్ టెలికాం ఆపరేటర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ముందుగా ఒకటి జియో నెట్ వర్క్ అయితే రెండోది ఎయిర్‌టెల్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ యూజర్స్‌ని పెంచుకోవడం కోసం పోటాపోటీగా కస్టమర్స్‌కి సేవలు అందిస్తోంది కూడా ఈ రెండు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే. జియో ఎలాగైతే సింగిల్ రీచార్జ్‌లో మల్టిపుల్ బెనిఫిట్స్ అందిస్తుందో.. అలాగే ఎయిర్‌టెల్ కూడా ఒకే రిచార్జ్ ప్లాన్‌తో బహుళ ప్రయోజనాలు అందిస్తోంది.

ఎలాగైతే తమ కస్టమర్స్‌కి సేవలు అందించే విషయంలో పోటీపడుతున్నాయో.. ధరలను ఫిక్స్ చేసే విషయంలో కూడా జియో, ఎయిర్‌టెల్ ఇంచుమించు ఒకే రకంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే అటు జియోలో ఇటు ఎయిర్‌టెల్‌లో.. రెండింటిలోనూ రూ.999 రీచార్జ్ ప్లాన్ ఉంది. రూ.999 విలువ చేసే రీచార్జ్ కార్డుతో కాలింగ్, డేటా, ఓటిటి లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకరకంగా చెప్పాలంటే నెలవారీ రెంట్‌తో కూడిన యాన్వల్ రీచార్జ్ ప్లాన్ ఇది. అంటే పోస్ట్ పెయిడ్ టారిఫ్ అన్నమాట. జియో ఫైబర్ అందిస్తున్న రూ. 999 రీచార్జ్ ప్లాన్‌తో 150mbps అప్‌లోడింగ్ స్పీడ్, 150mbps డౌన్‌లోడింగ్ స్పీడ్‌తో అపరిమితమైన ఇంటర్నెట్ డేటా, కాలింగ్ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ఈ రీచార్జ్ కార్డుతోనే అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, వూట్ సెలెక్ట్, సోని లివ్ , జి5 వంటి మొత్తం పది రకాల ఓటిటి సేవలకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఇవేకాకుండా అదనంగా ఆన్ డిమాండ్ 550 వరకు టీవీ ఛానెళ్లు వీక్షించే అవకాశం కూడా ఉంది.

ఇక ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ అందిస్తున్న రూ. 999 రీచార్జ్ ప్లాన్‌తో ఉన్న లాభాల గురించి చూసుకుంటే.. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌కి పెట్టిన పేరే ఎంటర్‌టైన్మెంట్ ప్యాక్. పేరుకు తగినట్టుగానే ఇంటర్నెట్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా 200mbps స్పీడ్ తో ఇంటర్నెట్ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్‌తో పాటు అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటిటి యాప్స్‌కి సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. 

జియోలో ప్లాన్‌తో సంబంధం లేకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.999 రీచార్జ్ ప్యాక్ అదనంగా అందిస్తున్న ఆఫర్స్ ఏంటంటే.. ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వీఐపి సర్వీస్, అపోలో 24/7 సేవలకు సబ్‌స్క్రిప్షన్, ఫాస్టాగ్, వింక్ ప్రీమియం వంటి సేవలపై క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

ఇది కూడా చదవండి : OnePlus 10 Pro 5G Price: సూపర్ ఫీచర్స్ ఉన్న ఈ 5G ఫోన్ ధరపై రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్

ఇది కూడా చదవండి : OnePlus 11 5G Phone: వాలెంటైన్స్‌ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్

ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News