Devara: దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి..

Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. చాలా యేళ్ల తర్వాత అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా ప్రదర్శనలో ఓ అపశృతి జరిగింది. సినిమా చూస్తూ ఓ ఫ్యాన్ మృతి చెందడం కలకలం రేపుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 27, 2024, 12:37 PM IST
Devara: దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి..

Devara Fan Died: వరల్డ్ వైడ్ గా దేవర మూవీ జాతర కొనసాగుతోంది. అయితే మూవీ రిలీజ్ సందర్భంగా విషాదం నెలకొంది. మూవీ చూస్తూ  కడపలో ఎన్టీఆర్ అభిమాని చనిపోయాడు. సినిమా రిలీజ్ సందర్భంగా కడప అప్సర థియేటర్ లో అభిమానుల కోసం ఫ్యాన్స్ స్పెషల్‌ షో వేశారు. సినిమా చూస్తున్న టైంలో కేకలు వేస్తూ ఒక్కసారిగా  కుప్పకూలాడు ఓ అభిమాని. దీంతో థియేటర్ సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిమాని మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతుడిది సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలి గా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాద  ఛాయలు నెలకున్నాయి.

ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో తారక్ మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. దేవరగా, వరకా
రెండు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయాడు. మరోవైపు ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తన పాత్రలో జీవించాడు. బైరాగా అతని విలనిజం పండటంతో .. ఎన్టీఆర్ హీరోయిజం ఎలివేట్ అయింది. అంతేకాదు ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

మరోవైపు క్లైమాక్స్ సీన్ కూడా అదుర్స్ అనేలా కొరటాల శివ డిజైన్ చేసాడు. మొత్తంగా ఎర్ర సముద్రం సాక్షిగా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా తారక్ అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో $3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి హీరోగా ఎన్టీఆర్ స్టార్ డమ్ ఏంటో ప్రూవ్ చేసింది. మొత్తంగా ఈ సినిమా అన్ని ఏరియాల్లో దూసుకుపోతుండగా.. ఇక్కడ ఓ అభిమాని మృతి చెందడం మాత్రం కలిచివేసే విషయం అని చెప్పాలి.  

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News