Devara Update: సముద్రంలో ఎన్టీఆర్ భారీ యాక్షన్.. మూవీకి ఇదే హైలెట్ అంట..!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీ 'దేవర'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సముద్రం నేపథ్యంలో తెరకెక్కుస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 03:24 PM IST
Devara Update: సముద్రంలో ఎన్టీఆర్ భారీ యాక్షన్.. మూవీకి ఇదే హైలెట్ అంట..!

Devara Movie Update:  యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'(Devara Movie). తారక్‍కు జోడీగా జాన్వీ కపూర్, పవర్‍ఫుల్ విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ కొత్త  షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రం షూటింగ్ మెుదలైనప్పటి నుంచి ఎక్కువగా యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. తాజాగా మరో భారీ యాక్షన్ సీన్స్ ను తీసే పనిలో నిమగ్నమయ్యారు కొరటాల. ఈ ఫైట్ ను కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అండర్ వాటర్ ఫైట్ సన్నివేశాలను ఏకంగా 20 రోజులపాటు తీయనున్నారు. దీని కోసం మూడు రోజులపాటు తారక్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలెట్ నిలవబోతుందని సమాచారం. 

సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 05న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో ఈ మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో తారక్ విలన్‍గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Also read: Chandramukhi 2 Trailer: 'చంద్రముఖి 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News