"కాలా" సినిమాకి అంబేద్కర్ బోధనలే ప్రేరణా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం "కాలా". తమిళ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Last Updated : Jun 1, 2018, 06:07 PM IST
"కాలా" సినిమాకి అంబేద్కర్ బోధనలే ప్రేరణా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం "కాలా". తమిళ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ముంబయిలోని ధారావి ప్రాంతంలో తమిళుల పాలిట రక్షకుడిగా నిలిచిన ఓ డాన్ పాత్రలో ఈ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో దళిత హక్కుల పోరాటం మీద అంతర్లీనంగా ఓ కథాంశం ఉంటుందని.. ఒక విధంగా అంబేద్కర్ బోధనల ప్రేరణతోనే ఈ చిత్రంలోని పాత్రలను దర్శకుడు డిజైన్ చేశారని ఈ మధ్యకాలంలో పలు పత్రికలు వ్యాసాలు రాశాయి. అయితే అందుకు కారణం కూడా ఉందని పలువురు అంటున్నారు.

తనను తాను అంబేద్కరైట్‌గా పిలుచుకొనే పా రంజిత్ ఈ చిత్రంలో కూడా దళిత పోరాటాల గురించి చర్చించారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కథానాయకుడి జీపు మీదున్న నెంబర్ ప్లేటుపై ఉన్న BR అనే అక్షరాలు కూడా బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ చిత్రం తీస్తున్నారు అని సింబాలిక్‌గా చెప్పడం కోసమే వాడినట్లు తెలుస్తోంది. 

ర‌జ‌నీకాంత్ కెరీర్లో 164వ సినిమా అయిన కాలా చిత్రంలో నానా పటేకర్, హుమా ఖురేషి, సంపత్ రాజ్, సముద్రఖని, షియాజీ షిండే మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీ సరసన ఈశ్వరి రావు జంటగా నటించడం గమనార్హం.

Trending News