Kalki 2898 AD: హాలీవుడ్ సినిమాకు కల్కి రీమేక్? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

Kalki 2898AD release date: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి సినిమా రిలీజ్ డేట్.. ఫైనల్ గా జూన్ 27న ప్రకటించారు సినిమా యూనిట్. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి కొన్ని రూమర్స్ రాగ..దానిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 30, 2024, 10:07 AM IST
Kalki 2898 AD: హాలీవుడ్ సినిమాకు కల్కి రీమేక్? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

Kalki 2898AD Update: ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా‘క‌ల్కి 2898AD’. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పైన ప్రభాస్ అభిమానులే కాకుండా తెలుగు సినిమా అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ స్టార్స్‌ దీపికా ప‌దుకోన్‌, దిశాప‌టాని ల‌తో పాటు టాలీవుడ్ స్టార్ న‌టుడు రానా, మలయాళీ సూపర్ హీరో దుల్కర్ సల్మాన్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ సినిమా మే తొమ్మిదిన విడుదల కావాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్స్ ప్రభావం వల్ల..జూన్ 27 కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని ఒక కొత్త పోస్ట‌ర్‌ను సైతం అభిమానుల‌తో పంచుకుంది. ఈ పోస్ట‌ర్‌లో అమితాబ్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకోన్ నిల‌బ‌డి ఉండ‌గా.. ఎడారి లాంటి ప్రాంతంలో కొంద‌రు ప‌డి ఉండ‌డం క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ షేర్ చేసిన కాసేపటికి సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

అయితే ఈ పోస్టర్ చూడగానే కొంతమంది సినీ అభిమానులు.. క‌ల్కీ 2898 ADకి ఓ హాలీవుడ్ సినిమాకి పోలిక‌లు క‌నిపిస్తున్నాయని కామెంట్లు చెయ్యడం మొదలుపెట్టారు. కానీ ఒక ప్రముఖ బాలీవుడ్ సంస్థకు దీనిపై క్లారిటీ ఇస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా ఈ పోలికలను కొట్టిపారేశాడు. అస్సలు ఆ సినిమాతో ఈ సినిమాకి పోలిక లేదు అని..కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు విశ్వసించకూడదని తెలియజేశారు.

కాగా.. క‌ల్కీ సినిమాను హాలీవుడ్ సినిమాలతో పోల్చ‌డం ఇది మొదటిసారి కాదు. కాన్సెప్ట్, మేకింగ్‌, క్రాప్ట్ , విజువ‌లైజేష‌న్ ఇలా ప్ర‌తీదాన్ని ప్రేక్షకులు ఏదో హాలీవుడ్ సినిమాల‌తో పోలుస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలాంటి హాలీవుడ్ సినిమాకు రీమేక్ కాదని గట్టిగా చెప్పేసారు డైరెక్టర్. మరి ఇకనైనా ఈ పోలికలు ఆగుతాయేమో చూడాలి.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News