Shocking News: ఆత్మహత్య చేసుకున్న "కాంచన-3" సినిమా హీరోయిన్

కాంచన సినిమాలో రాఘవ లారెన్స్ పక్కన నటించిన అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2021, 11:36 AM IST
  • కాంచన-3 సినిమా హీరోయిన్ ఆత్మహత్య
  • బ్రేకప్ కారణంగా ఆత్మహత్య చేసుకోవచ్చని భాస్తున్నారు
  • దర్యాప్తు ప్రారంభించిన గోవా పోలీసులు
Shocking News: ఆత్మహత్య చేసుకున్న "కాంచన-3" సినిమా హీరోయిన్

రాఘవ లారెన్స్ (Raghava Lawerence) కాంచన సినిమాలో నటించిన రష్యన్ మోడల్ మరియు హీరోయిన్ "అలెగ్జాండ్రా జావి" (Alexandra Djavi) గోవాలోని (Goa) తన నివాసంలో పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు మొదటి విచారణలో 24 ఏళ్ల  ఈ హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. 

అయితే ఆమె సన్నిహితులు చెప్పైన దాని ప్రకారం, ఇటీవల ప్రియుడితో బ్రేకప్ జరగటం, విడిపోవటం వలన డిప్రెషన్‌లోకి  వెళ్లిందని తెలుస్తోంది. డిప్రెషన్‌లో ఒత్తిడి తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందని అనుకుంటున్నారు.

అంతకుముందు 2019 సంవత్సరంలో చెన్నై ఫోటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అలెగ్జాండ్రా జావి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలెగ్జాండ్రా జావి అనుమానాస్పదంగా మృతి చెందడం కోలీవుడ్ (Kollywood) వర్గాలే కాకుండా వారి  కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలకు గురవుతున్నారు.

Also Read: Bheemlanayak: పవన్ కళ్యాన్ ఆన్ ఫైర్... విడులైన 'బ్రేక్‌ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్‌ స్టైల్'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News