Bheemlanayak: పవన్ కళ్యాన్ ఆన్ ఫైర్... విడులైన 'బ్రేక్‌ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్‌ స్టైల్'

పవన్ కళ్యాన్ 'భీమ్లా నాయక్‌' సినిమా నుండి 'భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌' ట్యాగ్ తో ఒక వీడియో విడుదల చేసింది.. ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి మరీ!!

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2021, 12:28 PM IST
  • గన్ తో పవన్ కళ్యాన్ ఫైర్ చేస్తున్న వీడియో విడుదల
  • 'భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌' వీడియో రిలీస్ చేసిన చిత్ర యూనిట్
  • అదిరిపోయిన ఫైరింగ్ వీడియో
Bheemlanayak: పవన్ కళ్యాన్ ఆన్ ఫైర్... విడులైన 'బ్రేక్‌ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్‌ స్టైల్'

రానా-పవన్‌కల్యాణ్‌  (Rana Daggubati- Pawan kalyan) కాంబోలో విడుదలవనున్న సినిమా 'భీమ్లానాయక్‌' (Bheemlanayak).  సాగర్‌ కె.చంద్ర (Sagr K Chandra) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ రికార్డును కొల్లగొట్టింది. మలయాళంలో (Malayalam) సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ (Ayyappanum Koshiyum) రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’గా తెరకేక్కుకుత్తున విషయం మన అందరికి తెలిసిందే!
చిత్ర బృందం ఈ రోజు 'భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌' (Bheemlanayak In Break Time) అనే టాగ్ తో ఒక వీడియో రిలీజ్ చేసింది.. ఈ వీడియో లో పవన్ కళ్యాన్ గన్ పట్టుకొని షూట్ చేస్తూ, మళ్లీ గన్ లోడ్ చేస్తూ దారిలో నడవటం.. పక్కన...

"యోగి కమండలం కొమ్ములోంచి
చెట్లకి పాణ్ర దారాలు వదుల్తాడు
యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి 
ప్రకృతికి వత్తాసు పలుకుతాడు
నాయకుడు ఈ రెండింటినీ
తన భుజాన వేసుకుంటూ
ముందుకు కదుల్తాడు....!"

అంటూ సాగే ఈ వీడియో అద్భుతం అని చెప్పాలి...

Also Read: IFFM-2021: ఉత్తమ నటుడిగా సూర్య, మనోజ్‌ బాజ్‌పాయ్‌.. ఉత్తమ నటిగా సమంత, విద్యాబాలన్‌

వరుస సినిమాతో బిజీ గా ఉన్న పవన్ కళ్యాన్ (Pawan Kalyan) సినిమా షూటింగ్‌ లను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వచ్చే ఏడాదిన సంక్రాంతి (Sankranti Festival) కానుకగా జనవరి 12న(January 12 2022) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బీజుమేనన్‌ (Biju Menon) పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ (Pawan Kalyan).. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) పోషించిన పాత్రలో రానా దగ్గుబాటి (Rana Daggubati) కనిపించనున్నారు. ఈ సినిమాలో నిత్యామేనన్‌ (Nitya Menon), ఐశ్వర్యా రాజేశ్‌ (Aihwarya Rajesh) కథానాయికలుగా కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్క్రీన్‌ప్లే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)అందించగా, తమన్‌ (Thaman) స్వరాలు అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News