Karan Johar Car Collection: బాలీవుడ్ లో కరణ్ జోహార్ సినిమా నిర్మాతగా.. డైరెక్టర్ గా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. టీవీ షోలలో పోస్ట్ గా ప్రజల మన్ననలు పొందాడు. ఆయనను బాలీవుడ్లో సక్సెస్ కు ఐకాన్ గా కూడా చెప్పుకుంటారు. ఇటీవలే పలు కారణాలతో సోషల్ మీడియాలో నెగిటివ్గా ట్రెండ్ అయినప్పటికీ తగ్గేదే లే అంటూ ముందుకు నడుచుకుంటాడు కరణ్..
ఈ మధ్య కరణ్ జోహార్ సెలబ్రిటీల సెక్సువల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో క్వశ్చన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఏదేమైనాప్పటికీ కరణ్ జోహార్ లగ్జరీగా బతకాలనుకుంటాడు. అందుకే ఆయన నివసించే బంగ్లా నుంచి ఆయన తిరిగే కారు వరకు అన్ని లగ్జరీ స్థాయిలోనే ఉంటాయి. ఇక కరణ్ జోహార్ కారు కలెక్షన్ విషయానికొస్తే.. ఐదు రకాల లగ్జరీ కార్లను వినియోగిస్తాడు కరణ్. ఆయన షూటింగ్లో భాగంగా ఒక రకం కారుని వినియోగిస్తే.. సెలబ్రిటీ పార్టీల వెళ్లేందుకు కోసం ఇంకొక కారును వాడతారడు. ఇలా ఐదు రకాల ఖరీదైన కార్లను కరణ్ జోహార్ వినియోగిస్తాడు.
కరణ్ జోహార్ వినియోగించే కార్లలో అతి ఖరీదైన కారు. ఆడి కంపెనీకి చెందిన ఏ8ఎల్ ఒకటి. దీని ఖరీదు దాదాపు 1.35 కోట్లు. దీనిని కరణ్ సెలబ్రిటీ పార్టీలకు వెళ్లేందుకు వినియోగిస్తాడట. ఇక కార్ ఫీచర్ విషయానికొస్తే ఈ కార్ లీటర్ పెట్రోల్ కి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇది గంటలకు 250 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానానికి చేర్చుతుంది.
కరణ్ జోహార్ ఫ్యామిలీ కోసం మెర్సిడెస్ జిఎల్ఎస్ 350 కారును వినియోగిస్తాడు. ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళినప్పుడు ఈ కారులో ఎక్కువగా వెళ్తారని సమాచారం. ఇక ఇండియన్ మార్కెట్లో ఈ కారు ఖరీదు 88 లక్షలు. ఈ కారులో అధునాతన టెక్నాలజీతో అన్ని సదుపాయాలు ఉంటాయి.
కరణ్ జోహార్ తన కారు కలెక్షన్ లో ఆయనకిష్టమైన కారు మెర్సరీస్ మేబ్యాక్. ఈ కార్ని ఆయన చాలా అరుదుగా వాడతాడు. ఇక కార్ కాస్ట్ విషయానికొస్తే.. భారత మార్కెట్లో 1.86 కోట్ల రూపాయలుగా సంస్థ విక్రయిస్తోంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కి మూడు కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అంతేకాకుండా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్తుంది.
Also Read : Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు
Also Read : Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి