Krishnam Raju Death: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్ రియాక్షన్..

Krishnam Raju Death: ప్రముఖ దిగ్గజ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 11, 2022, 08:16 AM IST
  • దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూత
  • గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస
  • సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్న ఫ్యాన్స్
Krishnam Raju Death: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్ రియాక్షన్..

Krishnam Raju Death: టాలీవుడ్ దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కృష్ణంరాజు మరణంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంపై పలువురు సినీ సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

కృష్ణంరాజు మరణవార్త తెలియగానే హీరో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ఇది నిజం కాకూడదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్. చిత్రపరిశ్రమ కోసం, సమాజం కోసం మీరు చేసిన కృషి ఎప్పటికీ మా మదిలో నిలిచిపోతుంది. ఓం శాంతి కృష్ణంరాజు గారు.. మేము మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాం.' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

హీరో నిఖిల్ సిద్దార్థ కూడా కృష్ణంరాజు మరణంపై ట్విట్టర్‌లో స్పందించారు. 'ఒక దిగ్గజం.. బంగారం లాంటి మనసు కలిగిన మనిషి.. ఇక మనల్ని వదిలి వెళ్లారు. మిమ్మల్ని, మీ స్పూర్తినిచ్చే మాటలను మేము మిస్ అవుతాం సార్..' అంటూ నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణంరాజును పరామర్శించేందుకు హీరో ప్రభాస్ అక్కడికి వెళ్లారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కృష్ణంరాజు మరణంపై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఆయన పాత సినిమాలు, సినిమా ఫంక్షన్లలో ఆయన మాటలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Horoscope Today September 11th 2022: నేటి రాశి ఫలాలు... చంద్ర బలంతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News