Varun-Lavanya Wedding: ఫ్రెండ్స్‌కు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన లావణ్య, ఫోటోలు వైరల్

Varun-Lavanya Wedding: వరుణ్ తేజ్‍-లావణ్య త్రిపాఠిల పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి తన ప్రెండ్స్ కు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 04:25 PM IST
Varun-Lavanya Wedding: ఫ్రెండ్స్‌కు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన లావణ్య, ఫోటోలు వైరల్

Lavanya Tripathi Pre Wedding Party: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ ఏడాది జూన్‍లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు పెళ్లి గడియలు దగ్గరపడుతున్నాయి. వివాహానికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అల్లు, మెగా వారిళ్లలో గ్రాండ్ గా జరిగాయి. 

తాజాగా లావణ్య త్రిపాఠి తన స్నేహితులకు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ పార్టీకి హీరో నితిన్ భార్య షాలినీ, రితూవర్మ, నిహారిక, నీరజ సహా మరికొందరు లావణ్య ఫ్రెండ్స్ హాజరయ్యారు. అంతేకాకుండా తదుపరి స్టాప్ రోమ్ అని కూడా పేర్కొంది లావణ్య.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు చూసుకునేందుకు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. నవంబర్ 1వ తేదీన వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే లావణ్య, వరుణ్ ఇటలీకి పయనమైనట్లు సమాచారం. మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరూ లవ్ లో పడ్డారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.  చాలా ఏళ్లు వీరి ప్రేమ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. 

వరుణ్ తేజ్ మరోవైపు 'ఆపరేషన్ వాలెంటైన్' తో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయబోతున్నాడు. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో నవదీప్‌ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోంది. 

Also Read: Rashmika Mandanna: ''ది గర్ల్ ఫ్రెండ్''గా రాబోతున్న రష్మిక.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News