Love story movie: లవ్‌స్టోరీ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎప్పుడో తెలుసా

Love story movie: సారంగ దరియా పాటతో విడుదలకు ముందే క్రేజ్ సంపాదించుకున్న సినిమా లవ్‌స్టోరీ. అక్కినేని నాగ్‌చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ డేట్లపై ఉత్కంఠ నెలకొంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2021, 01:15 PM IST
Love story movie: లవ్‌స్టోరీ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎప్పుడో తెలుసా

Love story movie: సారంగ దరియా పాటతో విడుదలకు ముందే క్రేజ్ సంపాదించుకున్న సినిమా లవ్‌స్టోరీ. అక్కినేని నాగ్‌చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ డేట్లపై ఉత్కంఠ నెలకొంది.

ఇటీవలి కాలంలో సారంగ దరియా (Saranga dariya song) పాట సృష్టించిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. చక్కని జానపదంతో, పల్లవితో ఉర్రూతలూగిస్తూ సాగే సారంగదరియా పాటతో సినిమా విడుదలకు ముందే పాపులర్ అయిపోయింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్‌స్టోరీ( Love story) లో నాగ్ చైతన్య(Nag chaitanya), సాయి పల్లవి ప్రదానంగా నటిస్తున్నారు. సినిమా పాటతో పాటు ఇప్పటివరకూ విడుదలైన అన్ని పోస్టర్లు, టీజర్లకు ఊహించని రీతిలో స్పందన లభించింది. సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్, సారంగదరియా పాట సృష్టించిన హల్‌చల్‌తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ డేట్లు ఎప్పుడనేది ఆసక్తిగా మారింది.

లవ్‌స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 8వ తేదీన లవ్‌స్టోరీ మూవీ ట్రైలర్ ( Love story trailer) విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏప్రిల్ 13 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Love story pre release even) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి నేపధ్యంలో తక్కువ మందితో ఈ రెండు ఈవెంట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న లవ్‌స్టోరీలో నాగ్ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నుట్టు తెలిసింది. అటు సాయి పల్లవి ( Sai pallavi) సినిమాలో డ్యాన్సర్‌గా కన్పించనుందట. ఏప్రిల్ 16వ తేదీన విడుదల కాబోతున్న లవ్‌స్టోరీ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్బీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణ దాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. 

Also read: Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు COVID-19 పాజిటివ్, షూటింగ్ రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News