Guntur Karam Twitter Review: గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. మహేష్ బాబు మాస్ జాతర

Guntur Karam Public Talk: గుంటూరు కారం మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. భారీ అంచనాల నడుమ నేడు ఈ సినిమా థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. ట్విట్టర్‌లో ఆడియన్స్‌ రెస్పాన్స్ ఎలా ఉందో ఓ లుక్కేయండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 12, 2024, 09:14 AM IST
Guntur Karam Twitter Review: గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. మహేష్ బాబు మాస్ జాతర

 Guntur Karam Public Talk: సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజీ కాంబో దాదాపు 14 తరువాత వస్తున్న మూవీ గుంటూరు కారం. ఇప్పటికే సాంగ్స్‌, ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్‌పెటేషన్స్‌ పెరిగిపోయాయి. కుర్చీ మడతపెట్టి.. అనే సాంగ్‌ నెట్టింట భారీగా ట్రెండ్ అవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేడు (జనవరి 12న) ఆడియన్స్‌ ముందుకు వచ్చింది గుంటూరు కారం మూవీ. ఇప్పటికే అర్ధరాత్రి 1 గంట షోలు పూర్తవ్వగా.. ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. బాబు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

 

 

బ్లాక్ బస్టర్ మూవీ.. మహేష్ బాబు వన్‌మ్యాన్ షో.. అంటూ ట్విట్టర్‌లో గుంటూరు కారం గురించి రివ్యూలు ఇస్తున్నారు. ఇక మహేష్‌ బాబు-వెన్నెల కిషోర్ ట్రాక్‌ చాలా కామెడీ ఉందని అంటున్నారు. శ్రీలీల తన డ్యాన్స్‌తో కట్టిపడేసిందని చెబుతున్నారు. సూపర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్ నెక్ట్స్‌ లెవెల్‌ ఉందని పోస్టులు పెడుతున్నారు. 

 

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. కుర్చీ మడతబెట్టి సాంగ్.. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌ సెకండాఫ్‌లో హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. ఓవరాల్‌గా హిట్ బొమ్మ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. రమణ గాడి మాస్ జాతర అంటూ ఫ్యాన్స్‌ హంగామా ఓ రేంజ్‌లో ఉందంటున్నారు.

 

 

 

 

మహేష్ వన్ మ్యాన్ షోను పూర్తిగా ఎంజాయ్ చేశామని.. ప్రతిరేమ్‌లో సూపర్ స్టార్ హార్డ్‌వర్క్, అంకితభావాన్ని కనిపిస్తుందంటున్నారు. పంచ్ డైలాగ్స్ అదిరిపోయాయనని.. బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు. గుంటూరు కారం బ్లాక్‌బస్టర్ అని రివ్యూలు ఇస్తున్నారు. మూవీ డిసెంట్‌గా ఉందని.. మహేష్ బాబు ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ అదిరిపోయిందంటున్నారు. 

 

 

Trending News