Sitara Ghattamaneni Followers : మహేష్‌ కూతురా..మజాకా.. సితార రేర్ ఫీట్

Sitara Ghattamaneni Instagram Followers మహేష్‌ బాబు కూతురిగా సితారా ఘట్టమనేనికి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంటుంది. సితారా చేసే అల్లరి పనులు, వేసే డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా జనాలను మెప్పిస్తూనే ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 05:17 PM IST
  • నెట్టింట్లో మహేష్‌ కూతురు సందడి
  • సితారను ఫాలో అవుతున్న పది లక్షల మంది
  • ఇన్ స్టాగ్రాంలో సితారా రేర్ ఫీట్
Sitara Ghattamaneni Followers : మహేష్‌ కూతురా..మజాకా.. సితార రేర్ ఫీట్

Sitara Ghattamaneni Instagram Followers : మహేష్‌ బాబు కూతురు సితారాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. నమ్రత ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. సితార కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. అయితే గౌతమ్ మాత్రం ఈ సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటాడు. మహేష్‌ బాబు కూడా అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. కానీ తల్లీకూతుళ్లు మాత్రం సోషల్ మీడియా.. అందులోనూ ఇన్ స్టాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. ఇక తాజాగా సితార ఓ రేర్‌ ఫీట్‌ను అందుకుంది.

సితారకు సోషల్ మీడియాలో పదిలక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఇన్ స్టాగ్రాంలో వన్ మిలియన్ ఫాలోవర్లను రీచ్ అవ్వడంతో సితార గాల్లో తేలిపోతోంది. తన ఫ్యాన్స్, ఫాలోవర్లందరికీ థాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ వేసింది. అసలే సితార ఈ ఏడాది పెన్నీ సాంగ్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషనల్ సాంగ్‌ కోసం సితారను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

ఇక సితార వేసిన స్టెప్పులు అందరినీ మెప్పించాయి. ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ ఆనీతో కలిసి బాగానే స్టెప్పులు వేసింది. ఆనీ మాస్టర్ కూడా మహేష్‌ బాబు ఇంటికి వచ్చి మరీ సితారకు డ్యాన్స్ నేర్పించేది. కరోనా సమయంలో అయితే సితార రకరకాల వీడియోలను షేర్ చేసింది. ఆ సమయంలో యాక్టివ్‌గా ఉండటంతోనే ఇలా ఫాలోవర్లు పెరుగుతూనే వచ్చారు. ఇక మహేష్‌ బాబుతో ఉన్న వీడియోలను కూడా సితారా షేర్ చేస్తుంటుంది. దీంతో మహేష్‌ బాబు ఫాలోవర్లంతా కూడా సితారకు కూడా వచ్చేవారు. మొత్తానికి స్టార్ కిడ్స్‌లో సితారా ఇప్పుడు రేర్ ఫీట్ సాధించినట్టు అవుతోంది. సితారకు ఇలా తక్కువ కాలంలోనే మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు.

ఘట్టమనేని ఇంట్లో వరుసగా విషాదాలు జరిగిన సంగతి తెలిసిందే. నాన్నమ్మ ఇందిరా దేవీ మరణించిన సమయంలో సితారా వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. మిస్ యూ తాత గారు అంటూ సూపర్ స్టార్ కృష్ణ మరణం మీద సితార వేసిన పోస్ట్ అందరినీ కదిలించింది.

Also Read : Vijay Varisu Remuneration : విజయ్ రెమ్యూనరేషన్..నెట్టింట్లో చర్చలు.. అన్ని కోట్లా?  

Also Read : YS Jagan Troll Video : వైఎస్ జగన్ ట్రోల్ వీడియో.. నవ్వాపుకోలేకపోయిన మంచు లక్ష్మీ.. వైఎస్సార్‌సీపీ ఫ్యాన్స్ ఫైర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News