Vijay Varisu Remuneration : విజయ్ రెమ్యూనరేషన్..నెట్టింట్లో చర్చలు.. అన్ని కోట్లా?

Vijay Varisu Remuneration దళపతి విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకుడిగా రాబోతోన్న ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 04:52 PM IST
  • సంక్రాంతి బరిలోకి విజయ్ వారిసు
  • వారసుడు కోసం విజయ్ తీసుకున్నదెంత?
  • నెట్టింట్లో రెమ్యూనరేషన్ మీద చర్చ
Vijay Varisu Remuneration : విజయ్ రెమ్యూనరేషన్..నెట్టింట్లో చర్చలు.. అన్ని కోట్లా?

Thalapathy Vijay Varisu Remuneration : దళపతి విజయ్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంటుంది. విజయ్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కూడా కోలీవుడ్‌లో మంచి వసూళ్లు వస్తాయి. బీస్ట్ నాసిరకంగా ఉన్నా కూడా కోలీవుడ్‌లో వందల కోట్లు కొల్లగొట్టేసింది. తెలుగు, హిందీ భాషల్లో బీస్ట్ దారుణంగా బెడిసి కొట్టేసింది. కానీ కోలీవుడ్‌లో మాత్రం బాగానే ఆడింది. అలా విజయ్ సినిమాకు కోలీవుడ్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

అందుకే విజయ్‌కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తుంటారు. మామూలుగా అయితే ఇప్పుడు దేశంలో ప్రభాస్‌కే ఎక్కువ మొత్తం రెమ్యూనరేష్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్‌ సినిమాకు దాదాపు రూ. 120 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తన సినిమాలన్నింటికీ ఇంచు మించు ఇదే రేటును కోట్ చేస్తున్నట్టుగా సమాచారం.

 

అయితే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇంకే హీరోకు కూడా లేదనేది అందరికీ తెలిసిందే. మిగతా హీరోలంతా కూడా యాభై నుంచి డెబ్బై కోట్ల మధ్యలోనే ఉన్నారనే మరో టాక్. అయితే ఇప్పుడు విజయ్ వారిసు సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ మీద చర్చలు జరుగుతున్నాయి. విజయ్‌కి ఈ సినిమా కోసం రూ. 120 కోట్లు ఇచ్చారనే టాక్ బయటకు వచ్చింది.

అయితే ఇదంతా గాలి వార్తేనని, విజయ్‌కి కేవలం ముప్పై కోట్లు మాత్రం ఇచ్చారంటూ ఇంకో ప్రచారం ఊపందుకుంది. ఇలా మొత్తానికి విజయ్ రెమ్యూనరేషన్ మీద మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఏది నిజం ఏది అబద్దం అన్నది మాత్రం నిర్మాత దిల్ రాజుకే తెలియాలి.

Also Read : Ali Daughter Marraige : పవన్ కళ్యాణ్ అందుకే పెళ్లికి రాలేదు.. నోరు విప్పిన కమెడియన్ అలీ

Also Read : YS Jagan Troll Video : వైఎస్ జగన్ ట్రోల్ వీడియో.. నవ్వాపుకోలేకపోయిన మంచు లక్ష్మీ.. వైఎస్సార్‌సీపీ ఫ్యాన్స్ ఫైర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News