మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా Major Teaser విడుదల

Major Teaser: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మేజర్ టీజర్ విడుదలైంది. 26/11 ముంబై దాడుల్లో (26/11 Mumbai attacks) దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2021, 09:52 PM IST
  • మహేష్ బాబు చేతుల మీదుగా మేజర్ టీజర్ లాంచ్.
  • సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా మేజర్ హిందీ టీజర్ విడుదల.
  • 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మేజర్ మూవీ.
మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా Major Teaser విడుదల

Major Teaser: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మేజర్ టీజర్ విడుదలైంది. 26/11 ముంబై దాడుల్లో (26/11 Mumbai attacks) దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించాడు. శోభిత దూళిపాళ్ల, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మళయాళం భాషల్లోనూ విడుదల కానుంది. 

మేజర్ మూవీ నిర్మాతల్లో ఒకరైన మహేష్ బాబు (Mahesh Babu) మేజర్ మూవీ తెలుగు టీజర్‌ను విడుదల చేయగా మేజర్ హిందీ టీజర్‌ను సల్మాన్ ఖాన్ (Salman Khan) విడుదల చేశాడు. ఈ సందర్భంగా మేజర్ ఉన్నికృష్ణన్‌కి నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. ఇలాంటి సినిమా టీజర్ విడుదల చేస్తున్నందుకు తనకు కూడా ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. 

Also read : Chiranjeevi: వకీల్ సాబ్‌లో నటనకుగానూ Prakash Raj‌పై చిరంజీవి ప్రశంసల జల్లులు

మేజర్ మళయాళం వెర్షన్‌ టీజర్‌ను మళయాళం స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విడుదల చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News