Chiranjeevi: వకీల్ సాబ్‌లో నటనకుగానూ Prakash Raj‌పై చిరంజీవి ప్రశంసల జల్లులు

Prakash Raj Performance In Vakeel Saab: సినిమా కథాంశం సైతం నచ్చడంతో ప్రేక్షకులు వకీల్ సాబ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ పోటీపడి మరీ తమ లాయర్ పాత్రలకు న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 12, 2021, 04:32 PM IST
  • ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్
  • ఈ మూవీలో ప్రకాశ్ రాజ్ నటనకు ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి
  • ప్రకాశ్ రాజ్ ఉంటే తోటి నటీనటులు సైతం అద్భుత ప్రదర్శన చేస్తారని కితాబు
Chiranjeevi: వకీల్ సాబ్‌లో నటనకుగానూ Prakash Raj‌పై చిరంజీవి ప్రశంసల జల్లులు

దాదాపు మూడేళ్ల అనంతరం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించిన మూవీ వకీల్ సాబ్. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా కథాంశం సైతం నచ్చడంతో ప్రేక్షకులు వకీల్ సాబ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ పోటీపడి మరీ తమ లాయర్ పాత్రలకు న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది. 

మెగా ఫ్యామిలీ వకీల్ సాబ్ సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. వకీల్ సాబ్ మూవీలో ప్రకాశ్ రాజ్ నటనపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రకాశ్ రాజ్ లాంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంటే తోటి నటీనటులు సైతం అత్యుత్తమ నటనను బయటకు తీస్తారని చిరంజీవి కితాబిచ్చారు. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్‌తో పోటీ పడి లాయర్‌గా నటించారని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ను కొనియాడారు. అభినందనలు తెలపడంతో పాటు ఇలాగే మరెన్నో సినిమాలు తీయాలి ప్రకాశ్ అని చిరంజీవి(Chiranjeevi) ట్వీట్ చేశారు.

Also Read: Khiladi Teaser: మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడీ’ టీజర్ విడుదల, డ్యూయల్ రోల్ పోషించాడా

ఓవైపు పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత తీసిన కమ్ బ్యాక్ మూవీ కావడంతో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే అదే సమమయంలో పవన్‌కు ధీటుగా నటించిన ప్రకాశ్ రాజ్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల వకీల్ సాబ్ దర్శకుడు, నిర్మాతలను మెగాస్టార్ అభినందించారు. తాజాగా మరోసారి ప్రకాశ్ రాజ్ నటనపై చిరంజీవి ప్రశంసల జల్లులు కురిపించారు. కోర్టులో వాదన సీన్లు సినిమాకు హైలైట్‌గా మారాయి.

ఇదివరకే ప్రకాశ్ రాజ్ నటనపై స్పందించి, ప్రశంసించిన చిరంజీవి తాజాగా మరోసారి ట్వీట్ ద్వారా అభినందించారు. ప్రకాశ్ రాజ్ లాయర్ నందా పాత్రలో నటించి మెప్పించారు. ప్రకాశ్ రాజ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తూ దిగిన ఫొటోను తన తాజాగా ట్వీట్‌లో చిరంజీవి పోస్ట్ చేశారు. గతానికి భిన్నంగా తన సోదరుడు పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను మాత్రమే కాక మరో నటుడికి సైతం అంతే ప్రాముఖ్యత ఇస్తూ చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Pawan Kalyan: హోం క్వారంటైన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News