Sarkaru Vaari Paata Postponed: కరోనా కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' సినిమాలు (Sankranti 2022 Movies List) కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడ్డాయి. అయితే ఇదే సంక్రాంతి సీజన్ కు రావాల్సిన మహేష్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రం కూడా అంతకుముందే పోస్ట్ పోన్ అయ్యింది.
ఇప్పుడదే సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 1న మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా రిలీజ్ (Sarkaru Vaari Paata Release Date) కావాల్సింది. కానీ, దేశంలో మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినమా మరోసారి వాయిదా తప్పదని తెలుస్తోంది.
ఎందుకంటే సమ్మర్ లో 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ సినిమాలోని హీరో మహేష్ బాబు (Mahesh Babu Corona), హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh Corona) లు ఇద్దరు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ స్వల్ప లక్షణాలతో ఇప్పటికే ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. పైగా మహేష్ బాబుకు ఇటీవల శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో 'సర్కారువారి పాట' చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది.
ఏప్రిల్ 1వ తేదీకి సినిమా పూర్తయ్యే సూచనలు దాదాపు కనిపించటం లేదు. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప చిత్ర బృందానికి మరో అవకాశం లేదని టాలీవుడ్ టాక్. పరిస్థితులన్నీ చక్కబడి సినిమా చిత్రీకరణ పూర్తయితే ఆగస్టు 5న విడుదల (Sarkaru Vaari Paata New Release Date) చేయాలని దర్శక-నిర్మాతలు యోచిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. సరికొత్త లుక్‌లో మహేశ్ (Mahesh Babu News) సందడి చేయనున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సర్కారు వారి పాట మూవీని నిర్మిస్తున్నాయి.
Also Read: Krithi Shetty Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ కన్నడ ముద్దుగుమ్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook