సీఎం పేషీలో మహేష్ బాబు

Last Updated : Nov 6, 2017, 11:22 AM IST
సీఎం పేషీలో మహేష్ బాబు

అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి. ఇప్పుడు రాజకీయ తతంగమంతా సీఎం పేషీకి మారిపోయింది. అక్కడ యువ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇదేంటీ? సీఎం పేషీ, యువ ముఖ్యమంత్రి అంటున్నారు అనుకుంటున్నారా.. నేను చెబుతున్నది మహేష్ బాబు 'నటిస్తున్న భరత్ అను నేను' సినిమా గురించి. మొన్నటివరకు అసెంబ్లీ సమావేశాల సెషన్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. 

ఇప్పుడు మహేష్  సీఎం పేషీలో కనిపిస్తున్నాడు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సీఎం పేషీ సెట్లో మహేష్ బాబు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ సీఎం పాత్ర పోషిస్తున్న మహేష్ బాబు నిర్ణయాలు తీసుకుంటున్న సన్నివేశాలు, ప్రతిపక్షాల ఎత్తుల్ని చిత్తు చేయడం లాంటి సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మహేష్ నటన, కనిపించే విధానం ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం.  'భరత్ అను నేను'  సినిమాలో మహేష్ పక్కన కైరా అడ్వాణీ హీరోయిన్. చిత్ర డైరెక్టర్ కొరటాల శివ. నిర్మాత డివివి దానయ్య. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. 

Trending News