Mahesh Babu: తమిళంలో దూసుకెళ్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ

Sarileru Neekevvaru | తెలుగు హీరోలకు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు

Last Updated : Nov 21, 2020, 07:45 PM IST
    1. తెలుగు హీరోలకు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.
    2. తాజాగా మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు.
    3. తమిళనాట నవంబర్ 20న 220 విడుదలైన ఈ చిత్రం మొత్తం 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
Mahesh Babu: తమిళంలో దూసుకెళ్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ

Sarileru Neekevvaru in Tamilnadu | తెలుగు హీరోలకు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు. తమిళనాట నవంబర్ 20న 220 విడుదలైన ఈ చిత్రం మొత్తం 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో పాటు సినిమాకు పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది.

Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!

2020 ఆరంభంలో మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి బరిలోకి దిగింది సరిలేరు నీకెవ్వరు ( Sarileru Neekevvaru ). అక్కడి ప్రేక్షకులకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. పైగా ప్రకాశ్ రాజ్ ( Prakash Raj ) అక్కడ కూడా విలక్షణ నడుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా స్పైడర్ సినిమా మహేష్ బాబుకు ( Mahesh Babu ) మరో ప్లస్ పాయింటి. వెరసి వీటన్నింటి ప్రభావం సరిలేరు నీకెవ్వరుపై కనిపిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌ అనియ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

మరోవైపు కలెక్షన్ల పరంగా కూడా సినిమా మంచి దూకుడు చూపిస్తోంది. మొదటి రోజు 0.12 లక్షల గ్రాస్ ను కలెక్షన్స్ రాబట్టింది. కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి సమయంలో ఈ మాత్రం వసూళ్లు చేయడం మంచి విషయమే అని చెప్పాలి. తెలుగులో ఆగడు చిత్రం ప్లాప్ అయినా.. తమిళంలో మంచి విజయం సాధించింది. ఒక రకంగా చెప్పాలి అంటే మహేష్ బాబు మాస్ అవతారాన్ని తమిళ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తోంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News