హాలీవుడ్‌ సినిమాలో మంచు లక్ష్మి..!

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ తెలుగు చలనచిత్ర పరిశమ్రలో నటిగా, వ్యాఖ్యాతగా సుపరిచితురాలు.

Last Updated : Jan 19, 2018, 12:05 PM IST
హాలీవుడ్‌ సినిమాలో మంచు లక్ష్మి..!

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ తెలుగు చలనచిత్ర పరిశమ్రలో నటిగా, వ్యాఖ్యాతగా సుపరిచితురాలు. ఆమె ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా తన లక్ పరీక్షించుకోనున్నారు. ఆమె నటించిన ఆంగ్ల చిత్రం 'బాస్మతి బ్లూస్' వచ్చే నెల 9వ తేదిన విడుదల కానుంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఓ పల్లె పడుచు పాత్రలో తాను ఈ చిత్రంలో నటిస్తున్నానని ఆమె తెలిపారు.

కథానాయకుడికి సోదరి పాత్రలో తాను నటిస్తున్నట్లు కూడా చెప్పారు. ఆస్కార్ పురస్కార గ్రహీత బ్రీలార్సన్‌తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు డొనాల్డ్ సదర్లాండ్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ హాలీవుడ్ చిత్రం హిందీలో విడుదల కానుంది. డాన్ బారన్  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

Trending News