Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ (Adipurush) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. 

Last Updated : Nov 19, 2020, 09:47 AM IST
Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్

Prabhas ‘Adipurush’ Movie Release on 11th August 2022: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ (Adipurush) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆ సినిమాల అప్డేట్ కోసం డార్లింగ్ అభిమానులు నిత్యం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రకటించిన విధంగానే.. మూవీమేకర్స్ గురువారం ఉదయం ప్రభాస్ 22వ సినిమా ‘ఆది పురుష్‌’ రిలీజ్ డేట్‌ (Adipurush release date) ను ప్రకటిస్తూ.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

ఆగస్టు 11, 2022న ఆదిపురుష్‌ (august-11-2022) సినిమా విడుదలవుతుందని మూవీ మేకర్స్ తెలిపారు. 3డీ మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొంది. అయితే 2021 జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని మూవీ మేకర్స్ ట్విట్ చేసి వెల్లడించారు. 

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు తన్హాజీ సినిమా ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. టీ-సిరీస్ బ్యానర్‌లో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలను ఎవరుచేస్తున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ ప్రకటించడంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు సంబరపడుతున్నారు. Also read: Mumbai Police: కంగనా, రంగోలీలకు మూడోసారి నోటీసులు

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News