Chiranjeevi: మెగాస్టార్ చిరుపై విష ప్రయోగం, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది..వైరల్ అవుతున్న వార్త

Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరు ప్రమోషన్ వ్యవహారంలో బిజీగా ఉంటూనే..కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2023, 09:54 AM IST
Chiranjeevi: మెగాస్టార్ చిరుపై విష ప్రయోగం, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది..వైరల్ అవుతున్న వార్త

మెగాస్టార్ చిరంజీవిపై విష ప్రయోగం జరిగిందా. ఎప్పుడు జరిగింది..ఎలా జరిగింది, అసలేమైంది..ఇదేమీ రూమర్ కాదు. ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ చిరంజీవే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది.

విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక అనంతరం మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. సంక్రాంతి పురస్కరించుకుని ఈ నెల 13న విడుదలవుతున్న వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరు మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి వేళ పూనకాలు లోడింగ్ అంటూ ఆదరగొట్టేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉంటూనే మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనల్ని వివరించారు. 

వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘటనల గురించి వివరిస్తూ అందరూ షాక్‌కు గురయ్యే వాస్తవాల్ని వెల్లడించారు. తనపై ఓ సారి విష ప్రయోగం జరిగిందని చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మరణమృదంగం సినిమా షూటింగ్ సందర్భంగా విష ప్రయోగం జరిగిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ ఘటనను ఓ పిచ్చి అభిమాని చేసిన పనిగా వదిలేశామన్నారు. కేరళ నుంచి వశీకరణ మందు తీసుకొచ్చి తినిపించారన్నారు. 

మరణమృదంగం సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కొంతమంది అభిమానులు కేక్ కట్ చేయించారని చిరు చెప్పారు. అందులో ఓ అభిమాని బలవంతంగా కేక్ ముక్క నోట్లో పెడితే..కాస్త చేదుగా ఉండటంతో అనుమానంతో పరీక్ష చేయించామన్నారు. ఆ పరీక్షలో అందులో విషం ఉన్నట్టు తేలిందన్నారు. ఈ ఘటనపై నిర్మాత కేఎస్ రామారావు ఆ అభిమానిని పట్టుకుని నిలదీస్తే..చిరంజీవి ఈ మధ్యన తనతో సరిగ్గా మాట్లాడటం లేదని..ఇతరులతో ఇంటరాక్ట్ అవడం వల్ల ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. అది అభిమానమనుకోవాలో, మూర్ఘత్వమనుకోవాలో అర్ధం కాలేదని చిరు వివరించారు. 

అప్పటి సంగతేమో గానీ..ఇప్పుడు మాత్రం ఈ వ్యవహారం తెగ వైరల్ అవుతోంది. కొన్ని సోషల్ మీడియాల్లో అయితే ఇప్పుడు తాజాగా విష ప్రయోగం జరిగినట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. 

Also read: Prashant Neel: కేజీఎఫ్ అంత రఫ్ కాదనుకుంటా, బాధతో ట్విట్టర్ ఎక్కౌంట్ క్లోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News