Chiru welcomes Salman khan: బాలీవుడ్ మేటి హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా స్ట్రైట్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నారు. సల్మాన్ రాకను మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలుకుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్. సినిమా చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ పంచుకోబోతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్ సంచలనం రేపబోతోందని సినీ వర్గాల అంచనా. రెండు భాషల్లో ఇద్దరు అగ్రహీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కనుంది. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్‌గా తెలుగులో ఈ సినిమా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రాకను చిరంజీవి స్వయంగా స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు.
మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపర్చింది. ఉత్సాహాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. మీతో స్క్రీన్ పెంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్ ఇస్తుందని చెప్పడంలో..ఎటువంటి సందేహం లేదంటూ ఘన స్వాగతం పలికారు కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కొత్త గెటప్‌లో కన్పించనున్నారు.
Welcome aboard #Godfather ,
Bhai @BeingSalmanKhan ! Your entry has energized everyone & the excitement has gone to next level. Sharing screen with you is an absolute joy. Your presence will no doubt give that magical #KICK to the audience.@jayam_mohanraja @AlwaysRamCharan pic.twitter.com/kMT59x1ZZq— Chiranjeevi Konidela (@KChiruTweets) March 16, 2022
మెగాస్టార్ చిరంజీవి..సల్మాన్ ఖాన్ కలిసి నటించనున్న ఈ సినిమాపై చాలాకాలంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పలు హిందీ సినిమాల డబ్బింగ్ ద్వారా సల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు చేరువైనా..నేరుగా తెలుగు సినిమాలో నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Also read : Mision Impossible: తాప్సీ ప్రధాన పాత్రలో..మరో యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook