Keerthy Suresh: కీర్తి సురేష్ సర్కారు వారి పాట గురించి ఏమందంటే..

మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయిక కీర్తి సురేష్. మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. 

Last Updated : Nov 4, 2020, 11:38 PM IST
    1. మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయిక కీర్తి సురేష్.
    2. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.
    3. కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం మిస్ ఇండియా ఇటీవలే ఓటీటీ వేదికపై విడుదలైంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ సర్కారు వారి పాట గురించి ఏమందంటే..

మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయిక కీర్తి సురేష్. మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం మిస్ ఇండియా ( Miss India ) ఇటీవలే ఓటీటీ వేదికపై విడుదలైంది. వుమెన్ ఒరియెంటెడ్ అయిన ఈ చిత్రంలో కీర్తి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మహనటి.. సర్కారు వారి పాట చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. 

Also Read | Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్... 

సర్కారు వారి పాట చిత్రంలో తన పాత్ర గురించి ఎక్కువగా చెప్పని కీర్తి సురేష్ ( Keerthy Suresh )..సర్కారు వారి పాట చిత్రంలోని పాత్ర గురించి చెప్పేందుకు చాలా సమయం ఉంది. మంచి సమయం అనిపించినప్పుడు నేనే చెబుతాను అని స్పందించింది. ఆ మూవీ షూటింగ్ లో చేరేందుకు ఇంకా సమయం ఉంది అని జనవరిలో చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉంది తెలిపింది కీర్తి.

కీర్తీ సురేష్ మన్మథుడు 2లో గెస్ట్ రోల్ చేసింది. తరువాత పెంగ్విన్  మూవీలో కనిపించింది. తరువాత మిస్ ఇండియా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా పని ఉంది. నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న గుడ్ లక్ సఖీ చిత్రంలో నటించనుంది. ఈ మూవీలో ఆది పిని శెట్టి లీడ్ రోల్ చేస్తున్నాడు. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న రంగ్ దే మూవీలో కీర్తి కథానాయిక కాగా ఈ మూవీ షూట్ పూర్తయింది. 

Also Read | TS High Court: అగ్రీగోల్డ్ కేసు విచారణను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News