MLC Kalvakuntla Kavitha Writes a Letter to CBI on Liquor Scam Case: తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లిక్కర్ కేసులో సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఒక నిర్ధారిత ప్రదేశంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే తాను హైదరాబాదులో తన ఇంట్లోనే విచారణకు హాజరవుతానని కవిత అప్పటికప్పుడు సీబీఐకు సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా సీబీఐ తనకు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆ నోటీసులకు సంబంధించి ఆమె లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం నా వద్దకు రావాలనుకుంటున్నారు సరే ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదుతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు అందించాలని కవిత కోరారు.
సాధ్యమైనంత త్వరగా ఈ కాపీలను అందించాలని ఆమె సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహీకి లేఖ రాశారు. తాను మీరు ఇచ్చిన నోటీసుల్లో విషయాలన్నీ పరిశీలించానని ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కేసు పెట్టిన కంప్లైంట్ కాపీ కూడా అందజేయాలని కోరారు.
మీరు డాక్యుమెంట్లను సమర్పిస్తే మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక మీరు అడిగినట్లు డిసెంబర్ 6వ తేదీ కాకుండా ఈ డాక్యుమెంట్లు నాకు అందిన తర్వాత మరోసారి విచారణ డేట్ ఫిక్స్ చేద్దామని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ విషయం మీద సిబిఐ ఎలా స్పందించబోతుందనేది తెలియాల్సి ఉంది. ఈ లేఖను ఈమెయిల్ ద్వారా అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా కవిత ఢిల్లీ సీబీఐ అధికారులకు పంపారు.
Also Read: Mahesh Babu New Look: విషాదాల నుంచి కోలుకున్న మహేష్.. పని మొదలుపెట్టానంటూ పోస్ట్!
Also Read: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరు.. స్పిన్నర్లకు పండగే.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook