Custody Movie Day 1 Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా రూపొందింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి రోజు ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబట్టింది అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా ఎంత కలెక్ట్ చేసిందని వివరాల్లోకి వెళితే నైజాం ప్రాంతంలో మొదటిరోజు 76 లక్షలు వసూలు చేస్తే సీడెడ్ ప్రాంతంలో 23 లక్షలు వసూలు చేసింది.
Also Read: Keerthy Suresh Photos: అప్పుడే ఏడాది అంటూ ఆ హాట్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్
ఉత్తరాంధ్ర ప్రాంతంలో 22 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లా 11 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లా ఎనిమిది లక్షలు వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో 20 లక్షలు వసూలు చేస్తే కృష్ణా జిల్లాలో 12 లక్షలు, వసూలు చేసింది. నెల్లూరు జిల్లాలో 10 లక్షలు వసూలు చేయగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కోటి 82 లక్షల షేర్ మూడు కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక సహా మిగతా భారతదేశంలో ఎనిమిది లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో 60 లక్షల దాకా వసూలు చేసింది.
తమిళంలో 12 లక్షల వరకు ఈ సినిమా వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు కోట్ల 62 లక్షల షేర్ ఐదు కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కలిపి 24 కోట్ల ఐదు లక్షల కావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 25 కోట్లు నిర్ణయించారు.
ఈ సినిమా ఇంకా 22 కోట్ల 38 లక్షల వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి హిట్టుగా నిలుస్తుంది. అయితే సినిమాకి మిశ్రమ స్పందన లభించిన నేపథ్యంలో ఆ మేరకు వసూళ్లు రాబడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక కస్టడీ అన్ని భాషలకు మొదటి రోజు ఇండియా నెట్‌ని 3.20 కోట్లు సంపాదించింది. ఇది అన్ని భాషలకు మొదటి రోజు రూ. 3.06 కోట్లు వసూలు చేసిన యశోద, భారతదేశంలో రూ. 3.00 కోట్లు సంపాదించిన శాకుంతలం కంటే ఎక్కువ.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook