Anni Manchi Sakunamule: ఓటీటీలోకి రాబోతున్న 'అన్నీ మంచి శకునములే'’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Anni Manchi Sakunamule: నందిని రెడ్డి తెరకెక్కించిన 'అన్నీ మంచి శకునములే' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2023, 05:44 PM IST
Anni Manchi Sakunamule: ఓటీటీలోకి రాబోతున్న 'అన్నీ మంచి శకునములే'’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Anni Manchi Sakunamule OTT Release date: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'(Anni Manchi Sakunamule). ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎమోషనల్‌గా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. 

ఫ్యామిలీ ఎంటర్టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ (OTT Streaming) కానుంది. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. ఈ చిత్రం హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా చూడొచ్చు. స్వప్న సినిమాస్, మిత్రవింద మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, గౌతమి కీలకపాత్రల్లో నటించారు. 

ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయి... నెల రోజులు కూడా కాకుండానే సినిమాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ కూడా తక్కువ వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. థియేటర్ లో అదరగొట్టినా ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. 

Also Read: Adipurush Movie: ఆదిపురుష్ యూనిట్‌కు గుడ్‌న్యూస్, టికెట్ ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News