Hi Nanna OTT: ఓటిటి విడుదలకి సిద్ధమైన హాయ్ నాన్న.. ఈరోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్..

Hi Nanna: దసరా లాంటి ఊర మాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. వెంటనే పక్కా క్లాస్ చిత్రం ‘హాయ్ నాన్న’ తో  మన ముందుకి వచ్చి మరో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చే దానికి సిద్ధమయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 10:27 PM IST
Hi Nanna OTT: ఓటిటి విడుదలకి సిద్ధమైన హాయ్ నాన్న.. ఈరోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్..

Nani Hi Nanna: కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మన న్యాచురల్ స్టార్ నాని. మరోసారి అదే ఫాలో అవుతూ శౌర్యువ్ అనే దర్శకుడిని తన కొత్త చిత్రం హాయ్ నాన్న ద్వారా పరిచయం చేశారు.  మృణాల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే.. ప్రోమోలు, టీజర్, ట్రైలర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిందిహ. మొదటి షోకే పాజిటివ్ టాక్ అందుకని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మరోసారి నానికి సూపర్ హిట్ అందించింది. తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమ.. ఎమోషన్స్ తో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటిలోకి కూడా రాబోతుంది.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..ఈ సినిమా ఓటిటి రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని జనవరి 4 నుంచి తమ ఓటిటిలో లో స్ట్రీమింగ్ చేస్తామని వెల్లదించింది నెట్ ఫ్లిక్స్.

డిసెంబర్ 7వ తేదీన విడుదలైన 'హాయ్ నాన్న' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైపోయింది. సలార్ లాంటి భారీ చిత్రంతో పోటీ ఉన్న గాని ఇప్పటికి కూడా ఈ సినిమా రన్ కొన్ని ప్రాంతాలలో బాగానే  ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ తో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఈ సినిమా.
ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి.. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

శౌర్యూవ్ దర్శకత్వంలో వచ్చిన 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 

Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు

Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News