Hi Nanna Teaser : ఎమోషనల్ జర్నీగా సాగిన హాయ్ నాన్న టీజర్..

Hi Nanna : హాయ్ నాన్న టీజర్ మొదటి నుంచి చివరి వరకు ఒక ఎమోషనల్ జర్నీగా సాగి ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 11:50 AM IST
Hi Nanna Teaser : ఎమోషనల్ జర్నీగా సాగిన హాయ్ నాన్న టీజర్..

Hi Nanna :

నాని హీరోగా చేస్తున్న హాయ్ నాన్నా పైన ఈ సినిమా మొదటి లుక్ విడుదలైన దగ్గరి నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈరోజు విడుదలైన ఈ సినిమా టీజర్ ఈ చిత్రం మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. టీజర్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఎమోషనల్ గా సాగి ఈ సినిమా తప్పకుండా ఒక ఎమోషనల్ జర్నీ అవుతుంది అన్నట్టు సినిమాపై ఉత్కంఠను పెంచింది.

ముందుగా ఈ టీజర్ నాని, బేబీ కియారా ఖన్నా మధ్య మాటలతో మొదలైంది. తన కూతురు మా క్లాసులో వరుణ్ అనే అబ్బాయి ఉన్నారు.. అనగానే నాని అబ్బాయిల గురించి ఆలోచించే వయసా ఇది అని అంటారు. ఇక ఆ తర్వాత కియారా.. నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పే మాటలతో టీజర్ సాగింది. ఇక ఆ తరువాత నేను నాన్న గురించి సరే అనుకొని ఊరుకున్న కానీ తను మాత్రం ఊరుకోలేదు అని పాప చెప్పే డైలాగ్ తో మృనాల్ ఠాకూర్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి టీజర్ మరింత అందంగా, ఎమోషనల్ గా సాగింది. మృణాల్ నానిని నానా అని పిలవడం అలానే నాని పెళ్లి పెట్టుకొని నన్ను ప్రేమించాను అంటున్నావ్ ఏంటి అని మృణాల్ ని అడగడం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచాయి.

దర్శకుడు శౌర్యువ్ తన మొదటి సినిమాతోనే ఎమోషనల్ సీన్స్ పరంగా మ్యాజిక్ చేశారు అని ఈ టీజర్ చూస్తే అర్థమయిపోతుంది.చాలా ఎమోషన్స్‌తో కూడిన కాంప్లెక్స్‌ స్క్రిప్ట్‌ని హ్యాండిల్ చేయడం కొత్తవారికి అంత ఈజీ కాదు, కానీ శౌర్యువ్ మాత్రం తన అరంగేట్రంలోనే ఈ పనిని సులువుగా చేసినట్టు అనిపిస్తోంది. అలానే ఈ సినిమా కొంచెం నాగార్జున సంతోషం సినిమాని కూడా గుర్తు చేయక మానదు. హీరోయిన్ ప్రేమ అలానే కూతురు ప్రేమ అనే రెండు ఎమోషనల్‌ అంశాలను చక్కగా బ్యాలెన్స్‌ చేశాడు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం చక్కగా చూపించాడు.

నాని ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. చాలా కాలం తర్వాత ఇలాంటి ఎమోషనల్ పాత్రలో కనిపించడం బాగుంది. మరి ఈ సినిమా నాని కి ఎలాంటి సక్సెస్ చేస్తుందో తెలియాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాలి. ఇక ఈ సినిమాని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా ఈ సినిమా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News