Saripodha Sanivaram 1st Day Collections: నానికి బిగ్ షాక్ ఇచ్చిన ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే వసూళ్లు.. !

Saripodha Sanivaram 1st Day Collections: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’.  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనలే నెలకున్నాయి. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో మీరు ఓ లుక్కేయండి..

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 30, 2024, 12:05 PM IST
Saripodha Sanivaram 1st Day Collections: నానికి బిగ్ షాక్ ఇచ్చిన ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే వసూళ్లు.. !

Saripodha Sanivaram 1st Day Collections: నాచురల్ స్టార్ నాని తెలుగు సినీ పరిశ్రమలో ఒక మూసకు పరిమితం కాకుండా వరుసగా హిట్ చిత్రాలతో దూకుడుమీదున్నాడు. ప్పటికే దసరా, హాయ్ నాన్న వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో  వరుస  సక్సెస్ లు అందుకున్న నాని.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో నాని సూర్య అనే పాత్రలో నటించాడు. అంతేకాదు కోపాన్ని అణుచుకునే వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. కేవలం వారంలో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ఏ మేరకు వసూళ్లను రాబట్టిందనే విషయానికొస్తే..

ఈ సినిమా తెలంగాణ (నైజాం).. రూ.2.75 కోట్లు
రాయలసీమ (సీడెడ్).. రూ. 0.74 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్.. రూ. 2.39 కోట్లు..

మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ.5.88 షేర్ (రూ. 8.85 కోట్ల గ్రాస్) కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ.1.10 కోట్లు..
ఓవర్సీస్ .. రూ. 4.40 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 11.38 కోట్ల షేర్ (20.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా నాని గత సినిమాల ఫస్ట్ డే వసూళ్లతో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పాలి. కానీ ఈ సినిమాకు ఈరోజుతో పాటు శని, ఆదివారాలు ఎంతో కీలకం అని చెప్పాలి.

‘సరిపోదా శనివారం’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..  మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 11.38 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. మొత్తంగా రూ. 30.62 కోట్ల షేర్ రాబడితేనే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి చూస్తే .. ఈ సినిమా రివకరీ సాధించడం అంతా ఆషామాషీ కాదు. మరి ఈ రోజు, శని, ఆదివారాలు  తర్వాత ఈ సినిమా రిజల్ట్ ఏమిటనేది తేలనుంది.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News