Nani vs Vijay Devarakonda: నాని వర్సెస్ విజయ్ దేవరకొండ.. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుంది?

Nani-Vijay Devarakonda: ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో. నాని,విజయ్ దేవరకొండ పేర్లు ముందు ఉంటాయి. కాగా ప్రస్తుతం టైర్ 2 హీరోలుగా ఉంటున్న వీళ్లిద్దరిలో.. ఎవరో ఒకరు త్వరలో తెలుగులో సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారు.. వివరాల్లోకి వెళితే

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 14, 2024, 03:35 PM IST
Nani vs Vijay Devarakonda: నాని వర్సెస్ విజయ్ దేవరకొండ.. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుంది?

Tollywood Tier 2 Heroes : మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో చాలామంది ఇండస్ట్రీ కి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టారు. కానీ అందరూ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. కాగా సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చి.. తమ కష్టం, టాలెంట్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోల్లో.. మొదటగా గుర్తొచ్చే పేరు నాచురల్ స్టార్ నాని.. కాగా రెండవది సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.

వీరిద్దరూ కూడా చిరంజీవిలాగా చాలా చిన్న స్టేజి నుంచి స్టార్ హీరోలుగా ఎదిగిన వారే. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ.. హీరోగా అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకున్నారు. మరోవైపు అష్ట చమ్మ, అలా మొదలైంది వంటి చిన్న బడ్జెట్ సినిమాలతో తన కెరియర్ ని మొదలుపెట్టి.. ఇప్పుడు దసరా, జెర్సీ వంటి అద్భుతమైన సినిమాలతో భారీ కలెక్షన్లు అందుకుంటున్నారు నాచురల్ స్టార్ నాని. 

ఈ ఇద్దరు హీరోల కెరియర్ దాదాపుగా ఒకేలాగా ఉంటుందని చెప్పవచ్చు. ఒక రెండు మూడు వరుస ఫ్లాప్ సినిమాలు అందుకున్న వెంటనే.. ఈ ఇద్దరు హీరోలు ఏదో ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్ళీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. టైర్ 2 హీరోస్ లో వీరిద్దరి రేంజ్ వేరు. సినిమాకి మంచి టాక్ వస్తే వీరిద్దరి సినిమాలు టైర్ వన్ హీరోస్ రేంజ్ లో కలెక్షన్లు అందుకుంటాయి. వీరిద్దరితో పాటు టైర్ 2 లో ఉన్న హీరోలు ఎవరు వీళ్ళ రేంజ్ ని అందుకోలేకున్నారు.

ఈ క్రమంలో ఇప్పటిదాకా టైర్ 2 హీరోల జాబితా లో మాత్రమే ఉండిపోయిన ఈ ఇద్దరు హీరోలలో.. ఎవరో ఒకరు కచ్చితంగా త్వరలోనే టైర్ 1 హీరోగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం టైర్ వన్ హీరోస్ లో.. పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించేగా.. మహేష్ బాబు రాజమౌళి సినిమా వల్ల మరో రెండు మూడు సంవత్సరాలు బిజీగా ఉండే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టి నాని విజయ్ దేవరకొండ పైన ఎక్కువగా ఉంది.  ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో ఒక ప్యాన్ ఇండియా సినిమా, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తో మరొక సినిమా లైన్ లో పెట్టారు. 

మరోవైపు వరుస ఫ్లాపులు అందుకుంటున్న విజయ్ దేవరకొండ..ఇప్పుడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక  తనకి టాక్సీవాలా వంటి సూపర్ హిట్ ను అందించిన రాహుల్ సంకృత్యాన్ తో మరొక సినిమాని సైన్ చేశారు. రవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నారు. 

నాని, విజయ్ దేవరకొండ ఇద్దరి చేతుల్లో ప్రస్తుతం తలా ఒక మూడు సినిమాలు ఉన్నాయి. తమ అదృష్టవశాత్తు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే.. ఆ హీరో కచ్చితంగా టైర్ వన్ హీరోల జాబితాలో చేరిపోతారు.
మరి ఇద్దరూ హీరోలలో ఎవరు టైర్ 1కి మారతారు అని చెప్పాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే. ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రేక్షకుల్లో క్రేజ్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండ కి ఛాన్స్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ సెలక్షన్, మార్కెట్ బట్టి చూస్తే నాని కే టైర్ 1 హీరోగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Also Read: Andhra Pradesh Polling persantage 2024: ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. ఆ నియోజకవర్గంలో అత్యధికం అంటే.

Also Read: Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News