Nara Rohit: నారా రోహిత్ పెళ్లి బాధ్యతలు స్వీకరించిన సీఎం భార్య.. దగ్గరుండి మరీ సంబంధం..!

Nara Rohit Marriage : హీరో నారా రోహిత్.. పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీన ఈ హీరో నిశ్చితార్థం జరగనుంది. ఈ హీరోతో ప్రతినిధి సినిమాలో నటించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకోనున్నారు నారా రోహిత్. అయితే నారా రోహిత్ పెళ్లి చంద్రబాబు నాయుడు.. భార్య భువనేశ్వరి దగ్గరుంది జరిపించబోతోంది అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 11, 2024, 08:45 AM IST
Nara Rohit: నారా రోహిత్ పెళ్లి బాధ్యతలు స్వీకరించిన సీఎం భార్య.. దగ్గరుండి మరీ సంబంధం..!

Nara Rohit Engagement : బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నారా హీరో నారా రోహిత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా ఇటీవల ప్రతినిధి -2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. అందులో భాగంగానే థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసి మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం సుందరకాండ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన .. తాజాగా ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతినిధి -2 సినిమాలో నారా రోహిత్ కి జంటగా నటించిన సిరి లెళ్ళ తో ఏడడుగులు వెయ్యబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా దసరా పండుగ మరుసటి రోజు అనగా అక్టోబర్ 13వ తేదీన ఆదివారం రోజు హైదరాబాదులో ఘనంగా వీరి నిశ్చితార్థం జరగబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా విస్తుపోయే నిజం ఒకటి బయటకు వచ్చింది.

నారా రోహిత్ ఎవరో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడైన రామ్మూర్తి నాయుడు కొడుకే. ఇప్పుడు మరిది కొడుకుకు వివాహం జరిపించడానికి సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా నారా రోహిత్ కి హీరోయిన్ తో వివాహం జరిపించడానికి కారణం నారా భువనేశ్వరి అని వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. వయసు మీద పడుతుండడంతో తన మరిది కొడుకుకు ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్న భువనేశ్వరి.. ప్రతినిధి -2 సినిమాలో సిరి లెళ్ల, రోహిత్ ఈడు జోడు చాలా ముచ్చటగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అంతేకాదు నారా రోహిత్ పెళ్లి బాధ్యతలు అన్నింటిని కూడా ఆమె తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Also Read: Haryana: పని చేయని 'హస్తం' అస్త్రాలు.. ఫలితాల వేళ ట్రెండింగ్‌లో జిలేబీ స్వీట్

Also Read: Rahul Gandhi: చెదురుతున్న రాహుల్‌ గాంధీ కల.. తాజా ఫలితాలతో ప్రధానమంత్రి ఆశలు ఆవిరి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News