GST Council Meeting Latest Updates: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జైసల్మేర్ చేరుకున్నారు. ఈ సమావేశంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై ట్యాక్స్‌ను తగ్గించే అవకాశం ఉంది. ఖరీదైన చేతి గడియారాలు, బూట్లు, క్లాత్స్‌పై జీఎస్టీ రేట్లను పెంచడం, హానికరమైన వస్తువులపై స్పెషల్‌గా 35 శాతం ట్యాక్స్ విధిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 148 వస్తువులపై జీఎస్టీ రేట్లలో మార్పులపై చర్చించే అవకాశం ఉంది.
ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) GST పరిధిలోకి తీసుకురావడం గురించి కూడా చర్చించనున్నారు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై 18 శాతం జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యక్తులపై కూడా జీఎస్‌టీని రద్దు చేయనున్నారు. కొన్ని ప్రొడక్ట్స్, సేవలపై ట్యాక్స్ రేట్లను సవరించనున్నారు. కొన్ని వస్తువులపై జీఎస్‌టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించవచ్చు. Swiggy, Zomato వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నారు. దానిపై ఇన్‌పుట్ పన్ను క్రెడిట్‌ను రద్దు చేయవచ్చు.
ఇప్పటికే వాడిన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలపై 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని జీఎస్‌టీ ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ పెంపుతో పాత చిన్న కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ రేట్లు పాత పెద్ద వాహనాలతో సమానంగా మారనున్నాయి.
జీఎస్‌టీ రేట్ల ఏర్పాటైన మంత్రుల బృందం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, సైకిళ్లు, వ్యాయామ నోట్‌బుక్‌లు, లగ్జరీ వాచీలు, షూలపై మార్పులు చేయాలని ప్రతిపాదించింది. జీఎస్‌టీలో మార్పులతో ప్రభుత్వానికి రూ.22 వేల కోట్ల ఆదాయ ప్రయోజనం చేకూరనుంది. 20 లీటర్ల ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్‌పై 18 శాతం నుంచి 5 శాతానికి, రూ.10 వేల కంటే తక్కువ ధర కలిగిన సైకిళ్లపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సూచించింది. వ్యాయామ నోట్‌బుక్‌లపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, రూ.15 వేల కంటే ఎక్కువ ధర ఉండే షూలపై 18 శాతం నుంచి 28 శాతానికి, రూ.25 వేల కంటే ఎక్కువ ఖరీదు చేసే వాచీలపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని మంత్రుల బృందం సూచనలు చేసింది.
Also Read: Virat Kohli: భార్యాపిల్లలతో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్న విరాట్ కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter