Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా?

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ యానిమల్, పుష్ప చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ విషయం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 08:30 PM IST
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా?

Do you know Rashmika Speaks how many Languages: పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్‌ క్రష్‌గా(National Crush) మారింది రష్మిక మందన్న(Rashmika Mandanna). అప్పటి వరకు సౌత్ కే పరిమతమైన ఆమె క్రేజ్.. పుష్ప సినిమాతో దేశమంతటా వ్యాపించింది. దీంతో దక్షిణాదితోపాటు బాలీవుడ్ లోనూ అవకాశాలు రావడం మెుదలుపెట్టాయి శ్రీవల్లీకి. ఈ బ్యూటీ యాక్టింగ్ లోనూ కాదు చాలా విషయాల్లో మల్టీటాలెంటెడ్. ఈ కన్నడ సోయగం ఆరు భాషలలో(6 Languages) అనర్గళంగా మాట్లాడగలదట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న నటీమణుల్లో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ భామ నటిస్తోన్న  క్రేజీ ప్రాజెక్టుల్లో మూవీ యానిమల్ (Animal) ఒకటి. రణ్‌బీర్‌ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబరు 01న రిలీజ్ కానుంది. అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు  15న రిలీజ్ కానుంది. 

మరోవైపు రష్మిక ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి రెయిన్‌ బో (Rainbow) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు నిర్మిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: Jr NTR: చరిత్ర సృష్టించిన జూ.ఎన్టీఆర్.. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్ గా తారక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News