Hi Nanna: ప్రమోషన్ల కోసం లిప్ లాక్ సన్నివేశాలు వాడేస్తున్న హీరోల లిస్ట్ లో చేరిన నాని..

Hi Nanna: ఈ మధ్యకాలంలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో సినిమాలో ఉన్న ఇంటిమేట్ సన్నివేశాలను కూడా హీరోలు వాడేస్తున్నారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 10:55 AM IST
Hi Nanna: ప్రమోషన్ల కోసం లిప్ లాక్ సన్నివేశాలు వాడేస్తున్న హీరోల లిస్ట్ లో చేరిన నాని..

Hi Nanna: 

ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్లు ఉపయోగపడతాయో లేదో చెప్పలేం కానీ సినిమా ఓపెనింగ్ డే రోజు కలెక్షన్లు బాగా రావాలంటే మాత్రం ప్రమోషన్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. టీజర్, ట్రైలర్, పాటలు వంటి వాటితో సినిమాకి విపరీతమైన క్రేజ్ వస్తే కచ్చితంగా సినిమా మొదటి రోజున అనుకున్న దాని కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు. సినిమా హీరో, డైరెక్టర్ లేదా హీరోయిన్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ ని బట్టి కూడా సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు ఆధారపడుతున్నాయి.

అందుకే తమ సినిమాని అన్ని రకాలుగా ప్రమోట్ చేయడానికి దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ప్రమోషన్లకి పెద్దపీట వేస్తారు అనే సంగతి తెలిసిందే. ఇక చిన్న హీరోలు, డైరెక్టర్ లు కూడా ప్రమోషన్లను అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో హైలైట్ సన్నివేశాలు అన్నిటిని ప్రమోషన్ల రూపంలో ముందే చూపించేస్తున్నారు. ఈమధ్య కాలంలో ముఖ్యంగా సినిమాలో ఉన్న లిప్ లాక్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. 

న్యాచురల్ స్టార్ నాని కూడా తన తదుపరి సినిమా హాయ్ నాన్న ప్రమోషన్స్ విషయంలో సినిమాలో ఉన్న లిప్ లాక్ సన్నివేశాలు ఉపయోగించటం అభిమానులను షాప్ కి గురిచేసింది. ఈ మధ్యనే దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని తాజాగా ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అయితే సినిమా లో తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఎక్కువగా ఉండబోతోంది అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. టీజర్ లో కూడా వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలను బాగానే హైలెట్ చేసింది చిత్ర బృందం. 

ఈ మధ్యనే ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కూడా తన సినిమా బబుల్ గమ్ ప్రమోషన్స్ లో సినిమాలో ఉన్న లిప్ లాక్ సన్నివేశాలను బాగా హైలైట్ చేశారు. సినిమా హైప్ పెరగడం కోసం అలాంటి సన్నివేశాలని హైలైట్ చేస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 7 న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు

Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News