Nayanthara New House: కొత్త ఇంట్లో అడుగుపెట్టనున్న కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేశ్!

Nayanthara New House: కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ త్వరలోనే కొత్త ఇంట్లో అడుగుపెట్టనున్నారట. చెన్నైలోని పోయస్ గార్డెన్స్ ఏరియాలో ఇల్లు కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చగా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 04:46 PM IST
Nayanthara New House: కొత్త ఇంట్లో అడుగుపెట్టనున్న కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేశ్!

Nayanthara New House: స్టార్ హీరోల పక్కన నటిస్తూ వరుస ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు హీరోయిన్ నయనతార. కథానాయికగానే కాకుండా తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి కొన్ని సినిమాలకు నిర్మాతగానూ ఆమె వ్యవహరిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు నయనతారకు సంబంధించిన ఓ విషయం కోలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న నయన్‌ త్వరలోనే కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని ఆమె కొనుగోలు చేశారట.

4 బెడ్ రూమ్స్, ఒక హాల్, కిచెన్ కలిగి ఉన్న ఈ ఇంటి కోసం నయన్‌ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారని.. త్వరలోనే విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఆమె గృహప్రవేశం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో ఆమె త్వరలోనే మరో ఇంటిని సైతం కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు నయన్‌-విఘ్నేశ్‌ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని టాక్‌. వివాహం తర్వాత ఈ జంట నివసించడం కోసమే కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఉంటారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే వీళ్లిద్దరికీ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయన్‌ తెలుగులో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’, తమిళంలో ‘కాతువక్కుల రెందు కాదల్‌’, ‘కనెక్ట్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.   

Also Read: Pragya-Salman: సల్మాన్ సినిమాలో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్టే వచ్చి...చివరకు..!

Also Read: Acharya OTT Rights: ‘ఆచార్య’ సినిమా కోసం పోటీపడుతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News