Nikhil 18 Pages : ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్నా.. కథ కూడా నాకు తెలీదు.. నిఖిల్

Nikhil 18 Pages నిఖిల్ తన 18 Pages సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ వీకెండ్‌లో గ్రాండ్‌గా కలెక్షన్లను రాబట్టేసింది. అసలు ఇది రిలీజ్ కాక ముందే ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లింది. డే వన్ నుంచి వస్తున్నవన్నీ కూడా లాభాలే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 09:33 PM IST
  • దుమ్ములేపుతున్న నిఖిల్ 18 Pages
  • ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో నిఖిల్ చిట్ చాట్
  • ఆ కారణంతోనే సినిమా ఒప్పుకున్నాడట
Nikhil 18 Pages : ఆ ఒక్క కారణంతోనే ఒప్పుకున్నా.. కథ కూడా నాకు తెలీదు.. నిఖిల్

Nikhil 18 Pages నిఖిల్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమాతో ఊహించని విజయం అందుకున్నాడు. పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కార్తికేయ 2 హిట్ అవుతుందని, ఇంత స్టార్డం వస్తుందని దర్శక నిర్మాతలు, హీరో సైతం ఊహించి ఉండడు. మొత్తానికి కార్తికేయ 2తో నిఖిల్‌కు నేషనల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు 18 Pages సినిమాతో మరోసారి హిట్ కొట్టేశాడు. అలా వరుస హిట్లతో నిఖిల్ దూసుకుపోతోన్నాడు.

18 Pages సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌తోనే లాభాల్లోకి వచ్చింది. ఇక గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ చిత్రం ప్రాఫిట్ జోన్‌లోకి పడినట్టు అయింది. మొదటి వీకెండ్‌లో ఈ చిత్రం దాదాపు పదకొండు కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. ఇక ఓవర్సీస్‌లోనూ రెండు లక్షల డాలర్లను రాబట్టేసినట్టు తెలుస్తోంది.

18 Pages మంచి స్పీడు మీదుండటంతో నిఖిల్ మరింతగా ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ట్విట్టర్‌తో ఆస్క్ నిఖిల్ (#AskNikhil) పేరిట సందడి చేస్తున్నాడు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వెళ్తున్నాడు. చాలా మంది కార్తికేయ 2 గురించే అడుగుతున్నారు. ఆ తరువాత 18 Pages సినిమా గురించి ప్రశ్నిస్తున్నారు.

కార్తికేయ 2కి ఇంత రెస్పాన్స్ వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అని అడిగితే.. నిఖిల్ ఇలా సమాధానం ఇచ్చాడు. నేను అయితే అస్సలు ఊహించలేదు.. ఎవ్వరూ కూడా అలా ఎక్స్ పెక్ట్ చేయలేరు.. మనం ఎంతగా కష్టపడాలో అంత కష్టపడాలి.. మిగిలింది ఆడియెన్స్ చేతికి వదిలేయాలని అని అన్నాడు. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందంటూ.. ఈ కథను ఎందుకు ఒప్పుకున్నారు.. మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అని ఇంకో నెటిజన్ అడిగాడు.

 

18 Pages కథ ఏంటి.. పాయింట్ ఏంటి అనేది కూడా నాకు తెలీకుండానే ఒప్పేసుకున్నాను.. ఈ సినిమాను అర్జున్ సురవరం కంటే ముందే అంగీకరించాను.. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కాబట్టి సినిమాకు సైన్ చేశాను.. నాడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేడు గర్వపడుతున్నాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Also Read : Mega Fans Fire on Mythri Movie : బాలయ్య అంటే భయమా?.. చిరుపై అలసత్వమా?.. మైత్రీపై మెగా ఫ్యాన్స్ ఫైర్

Also Read : Veerayya Title Song : వీరయ్య.. అదరగొట్టేశావయ్యా.. దుమ్ములేపిసిన చిరు, డీఎస్పీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News