NTR Emotional Speech: కంటతడి పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్..వందలాది మంది ముందు భావోద్వేగం

సైమా అవార్డ్స్ 2023 శుక్రవారం నాడు దుబాయ్ లో ఈ వేడుక జరిగింది. ఇందులో మన జూనియర్ ఎన్ఠీఆర్ గారికి 'RRR' సినిమాలోని కొమురం భీమ్ పాత్రకు ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్ఠీఆర్ భావోద్వేకానికి గురయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 03:32 PM IST
NTR Emotional Speech: కంటతడి పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్..వందలాది మంది ముందు భావోద్వేగం

NTR Emotional Speech: దుబాయ్ వేదికగా శుక్రవారం సైమా అవార్డ్స్ 2023 కార్యక్రమం జరిగింది. ఇందులో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'RRR' సినిమాలోని కొమురం భీమ్ పాత్రకు ఈ పురస్కారం దక్కింది. అయితే ఈ అవార్డు అందుకున్న తర్వాత స్టేజ్ పైనే తారక్ భావోద్వేగానికి గురయ్యారు. మరోసారి తన అభిమానులపై ఉన్న ప్రేమను ఆయన తెలియజేశారు. 

ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "కొమురం భీమ్ పాత్ర కోసం నేను న్యాయం చేస్తానని నమ్మినందుకు జక్కన్నకి థ్యాంక్స్. నా సహ నటుడు, మై బ్రదర్, మై ఫ్రెండ్ రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్. నా అభిమానులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. వారందరికీ నా కృతజ్ఞతలు. నా ప్రయాణంలో నేను కింద పడిన ప్రతి సారి నన్ను పట్టుకొని పైకి లేపినందుకు.. నా కళ్ల వెంట కన్నీళ్లు వచ్చిన సమయంలో బాధ పడినందుకు.. నేను నవ్వితే నాతో పాటు సంతోషంగా ఉన్నందుకు.. నా జీవితంలో భాగమైన నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేస్తున్నాను" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: Namrata Malla in without BRA Look: మత్తెక్కించే కళ్లతో మగాళ్ల ఉసురు తీసేస్తోన్న మాయలేడి

ఎన్టీఆర్ కొత్త సినిమా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకులో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 'దేవర' టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుని పాత్ర పోషిస్తున్నారు. 'దేవర' సినిమాను వచ్చే ఏడాది అనగా వేసవిలో 2024 ఏప్రిల్ 5 విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read: Ganesh Chaturthi 2023 Offers: వినాయక చవితి స్పెషల్‌ ఆఫర్స్‌..Motorola E13 మొబైల్‌ కేవలం రూ.799కే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News