NTR Undergoes Minor Surgery: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు తారక్. అయితే ఈ ఫొటోలో తారక్ చేతికి గాయం అయినట్టు కనిపిస్తుంది. దాంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం ఏంటంటే ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ఎన్టీఆర్ గాయపడ్డారు. వర్కౌట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయం అయ్యింది.
ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు యంగ్ టైగర్. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానుంది. సినిమాలతోపాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు తారక్. గతంలో బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా చేస్తున్నారు.
Also Read: Ravi Teja New Movie: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ.. మరో కొత్త సినిమా ప్రకటన
Also Read: Acharya Neelambari Song: ‘నీలాంబరి’ పాట వచ్చేసింది.. రామ్ చరణ్ డ్యాన్స్ అదిరిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి