Acharya Neelambari Song: ‘నీలాంబరి’ పాట వచ్చేసింది.. రామ్ చరణ్ డ్యాన్స్ అదిరిందిగా!

Acharya Neelambari Song: ‘ఆచార్య’ సినిమాలోని ‘నీలాంబరి’ లిరికల్ సాంగ్ ను (Neelambari song) శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే డ్యాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 11:43 AM IST
    • ‘ఆచార్య’ మూవీ నుంచి ‘నీలాంబ‌రి’ సాంగ్ రిలీజ్
    • డ్యాన్స్ అదరగొట్టిన రామ్ చరణ్
    • ఫిబ్రవరి 4న విడుదల కానున్న ‘ఆచార్య’ సినిమా
Acharya Neelambari Song: ‘నీలాంబరి’ పాట వచ్చేసింది.. రామ్ చరణ్ డ్యాన్స్ అదిరిందిగా!

Acharya Neelambari Song: చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన తాజా మూవీ ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ఈ మూవీని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Mega Power Star Ram Charan) కీ రోల్‌ పోషించారు. ఇందులో రామ్‌ చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు.

ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆచార్య మూవీ (Acharya Movie) నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా (Diwali) ‘ఆచార్య’ మూవీ టీమ్ సెకండ్‌ సింగిల్‌ ‘నీలాంబరి’ పాటను (Neelambari song) శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. 

‘నీలాంబ‌రి’ (Neelambari song) అంటూ సాగే ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా ( Neelambari) పూజా కనిపించనుంది.

ఇక మెగాస్టార్‌‌ చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ (Kajal Agarwal) నటించారు. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్‌ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథనే ఆచార్య మూవీ (Acharya movie). ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: Hero Rajasekhar Latest News: పండగ రోజు సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం

Also Read: Attack On Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్ పోర్టులో నటుడు విజయ్ సేతుపతిపై దాడి.. కారణమిదే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News