Payal Ghosh Suicide : సూసైడ్ చేసుకుంటే దాని కారణం ఎవరంటే?.. మిస్టరీగా పాయల్ నోట్.. నెట్టింట్లో వైరల్

Payal Ghosh Suicide Note ప్రయాణం, ఊసరవెల్లి సినిమాలతో పాయల్ ఘోష్‌ అంతో ఇంతో ఫేమస్ అయింది. అలాంటి పాయల్‌ ఇప్పుడు సూసైడ్ నోట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాసిన నోట్‌ అంతా గందరగోళంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 12:40 PM IST
  • నెట్టింట్లో పాయల్ ఘోష్ రచ్చ
  • సూసైడ్‌ నోట్‌తో పాయల్ హల్చల్
  • ఎన్టీఆర్ మీద పాయల్ ప్రశంసలు
Payal Ghosh Suicide : సూసైడ్ చేసుకుంటే దాని కారణం ఎవరంటే?.. మిస్టరీగా పాయల్ నోట్.. నెట్టింట్లో వైరల్

Payal Ghosh Suicide Note పాయల్ ఘోష్ ట్విట్టర్‌లో ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పని లేదు. రెండు మూడేళ్ల క్రితం ట్విట్టర్‌లో మీరా చోప్రాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మధ్య పెద్ద యుద్దమే జరిగింది. ఎన్టీఆర్ ఎవరో తెలీదు అన్నట్టుగా మీరా చోప్రా కామెంట్లు చేయడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం, తిరిగి ఆమె కూడా కంప్లైంట్లు ఇవ్వడం అంతా జరిగింది. అయితే ఈ వార్ మధ్యలోకి పాయల్ ఘోష్‌ వచ్చింది. ఎన్టీఆర్ గొప్ప నటుడు, ఆయనతో కలిసి నటించాను అంటూ పాయల్ చెప్పుకొచ్చింది.

ఇక మీరా చోప్రాకు వ్యతిరేకంగా పాయల్ కామెంట్లు చేయడంతో ఈమె ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరైంది. దీంతో పాయల్ ఘోష్‌కు సోషల్ మీడియాలో మరింత డిమాండ్ పెరిగింది. అలా అప్పటి నుంచి ఎన్టీఆర్ గురించి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఫేమస్ అవుతోంది. 2020లోనే ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్ అవుతాడని చెప్పానని, కానీ అప్పుడెవ్వరూ నమ్మలేదు.. పైగా నవ్వారని పాయల్ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఆస్కార్ వేదికపై ఎలా మార్మోగిపోతోందో చూడండి అంటూ పాయల్ చెప్పుకొచ్చింది.

అయితే పాయల్ నాలుగు రోజుల క్రితం ఓ పోస్ట్ చేసింది. అందులో సూసైడ్ నోట్ లాంటిది కనిపిస్తోంది. నేను పాయల్ ఘోష్‌ని.. ఒక వేళ నేను సూసైడ్ చేసుకున్నా.. హార్ట్ ఎటాక్‌తో పోయినా కూడా దానికి కారణం ఎవరంటే? అని అలా ఖాళీగా వదిలేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పాయల్‌కు ఏమైంది? ఎందుకు ఇలా చేసింది? అసలేం జరుగుతోంది? అంటూ పాయల్ గురించి ఆరా తీస్తున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Ghosh (@iampayalghosh)

పాయల్‌ మీటూ బాధితురాలన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బుల్లితెర, వెండితెరపై ఎన్నో వేదింపులను ఎదుర్కొన్నాను అంటూ పాయల్ చెప్పుకొచ్చింది. ఇక అనురాగ్ కశ్యప్ వంటి వారి మీదా పాయల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాయల్ సూసైడ్ నోట్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read:  Allu Arjun Silence on Naatu Naatu : నాటు నాటుకు ఆస్కార్.. రగిలిపోతోన్నాడా?.. నోరు విప్పని అల్లు అర్జున్

Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News